Ginger | చ‌లి కాలంలో అల్లంతో అద్భుత ప్ర‌యోజ‌నాలు..! ఆ రోగాలు దూరం..!!

Ginger | చ‌లి చంపేస్తుంది. ఎముకలు కొరికే చ‌లి( Cold )కి ప్ర‌తి ఒక్క‌రూ వ‌ణికిపోతున్నారు. రోగ నిరోధ‌క శ‌క్తి( Immunity Power ) త‌గ్గిపోయి.. జ‌లుబు, జ్వ‌రం, ద‌గ్గు బారిన ప‌డుతున్నారు. ఈ రోగాల‌కు దూరంగా ఉండాలంటే అల్లం( Ginger )ను మ‌న మెనూలో చేర్చుకోవాల్సిందే. చలి కాలంలో అల్లంతో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. మ‌రి అవేంటో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

Ginger | ప్ర‌తి వంటింట్లోనూ అల్లం( Ginger ) ఉంటుంది. ప్ర‌తి వంట‌కంలోనూ అల్లంను విరివిగా ఉప‌యోగిస్తారు. ఎందుకంటే ఇది అనేక రోగాల‌ను దూరం చేస్తుంది. అంతేకాకుండా రోగ‌నిరోధ‌క శ‌క్తి( Immunity Power )ని పెంపొందించ‌డంలో కూడా స‌హాయ ప‌డుతుంది. చ‌లికాలంలో అయితే అల్లంను తీసుకోవ‌డం వ‌ల్ల అనేక అద్భుత ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు. జ‌లుబు, జ్వ‌రం, ద‌గ్గు వంటి రోగాల‌కు దూరంగా ఉండొచ్చు. చ‌లికాలం( Winter )లో వ‌ణుకు పుట్టినా, చ‌లి( Cold ) అనిపించినా.. అల్లం టీ లేదా క‌షాయం తాగ‌డం వ‌ల్ల చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. అల్లంతో మ‌రెన్నో లాభాలు ఉన్నాయి.. వాటిని కూడా ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

రోగ నిరోధ‌క శ‌క్తిని పెంపొందిస్తుంది..

అల్లంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ప్రతిరోజు కొద్ది మొత్తంలో అల్లం తినడం వల్ల జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లు త‌గ్గుతాయి. అంతేకాకుండా ద‌గ్గు వంటి వ్యాధుల నుంచి కూడా ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.

జీర్ణ‌క్రియ మెరుగు

చాలా మందిలో చ‌లికాలంలో జీర్ణ‌క్రియ నెమ్మ‌దిస్తుంది. దీంతో అజీర్ణం స‌మ‌స్య‌లు ఏర్ప‌డి గ్యాస్ వంటి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతాయి. అదే అల్లంను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణం అయ్యే ఎంజైమ్‌ల‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. ఈ క్ర‌మంలో మ‌నం తీసుకున్న ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. క‌డుపు తేలిక‌గా ఉంటుంది.. గ్యాస్, అజీర్ణం వంటి స‌మస్య‌లకు చెక్ పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది.

గొంతు నొప్పి మాయం..

చలికాలంలో గొంతు నొప్పి, దగ్గు, కఫం పెరుగుతాయి. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతు వాపును తగ్గిస్తాయి. ఉపశమనం కలిగిస్తాయి. అల్లం టీ లేదా అల్లంతో తేనె కలిపి వేడి నీరు తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

ర‌క్త ప్ర‌వాహం మెరుగు

అల్లం శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఇది చలికాలంలో నెమ్మదిగా రక్తం ప్రవహించడం వల్ల కలిగే తిమ్మిరి నొప్పి లేదా అలసటను తగ్గిస్తుంది. మెరుగైన రక్త ప్రసరణతో శరీరంలో శక్తి ఉంటుంది. మీరు మరింత చురుకుగా ఉంటారు.

Latest News