Oppp Reno 16 | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తోంది. రెనో 16 సిరీస్‌ను వచ్చే వారం చైనాలో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో లాంచ్‌కు ముందే ఈ మోడల్‌కు సంబంధించిన కెమెరా, కీలక ఫీచర్లను వెల్లడించింది.
ఒప్పో విడుదల చేసిన తాజా టీజర్ల ప్రకారం.. Oppo Reno 16, Reno 16 Pro మోడళ్లలో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండనుంది. దీంతో పాటు 50మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సర్, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా, LED ఫ్లాష్ యూనిట్ కూడా ఉండనున్నాయి. ఈ రెండు ఫోన్లలో కెమెరా మెగాపిక్సెల్ సామర్థ్యం ఒకేలా ఉన్నప్పటికీ.. అంతర్గత హార్డ్‌వేర్‌లో తేడాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
లీకుల ప్రకారం ఒప్పో రెనో 16 ప్రో మొబైల్‌లో 6.78 అంగుళాల LTPO డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్ ఉండే అవకాశం ఉంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 9500s చిప్‌సెట్‌తో ఈ ఫోన్ రానుంది.
చైనా కాలమానం ప్రకారం మే 25వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఒప్పో రెనో మొబైళ్లను విడుదల చేయనున్నారు. భారతీయ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలరే ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ రెనో 16 సిరీస్‌తో పాటు Oppo Pad6 టాబ్లెట్, Oppo Enco Air 5s TWS ఇయర్‌బడ్స్‌ను కూడా ఒప్పో కంపెనీ విడుదల చేయనుంది.
ఇక ప్రముఖ టెక్ వెబ్‌సైట్ 91 మొబైల్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒప్పో రెనో 16 సిరీస్‌ను భారత్ మార్కెట్‌లో జూలైలో విడుదల చేసే అవకాశం ఉంది. అంటే చైనాలో లాంచ్ అయిన దాదాపు నెల తర్వాత భారత్‌లోకి ఈ మొబైల్ సిరీస్ రానుంది.
భారత్‌లో ఈ సిరీస్ మొత్తం నాలుగు మోడళ్లలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. Oppo Reno 16, Oppo Reno 16 Pro, Oppo Reno 16 Pro Mini, Oppo Reno 16C మోడళ్లు ఉండనున్నట్లు సమాచారం.
ఇక ఒప్పో రెనో 16 ఫోన్ చైనాలో మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది. Galaxy Purple, Heartbeat, Moonlight Dark రంగుల్లో లభించనుంది. అలాగే 12జీబీ ర్యామ్+ 256 స్టోరేజ్, 12జీబీ ర్యామ్+512జీబీ స్టోరేజ్, 16జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్, 16జీబీ ర్యామ్+512 స్టోరేజ్, 16జీబీ ర్యామ్+1టీబీ వేరియంట్లలో విడుదల చేయనున్నారు.
Read More:
7560mAh భారీ బ్యాటరీ.. 100W ఫాస్ట్ చార్జింగ్‌తో రెడ్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర ఎంతంటే..!
శాంసంగ్ నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్.. గత మోడల్‌తో పోలిస్తే పెద్ద డిస్‌ప్లే, ప్రీమియం లుక్!
