Samsung Galaxy Z Flip 8 | శాంసంగ్ నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్.. గత మోడల్‌తో పోలిస్తే పెద్ద డిస్‌ప్లే, ప్రీమియం లుక్!

Samsung Galaxy Z Flip 8 | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఫోల్డబుల్ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ప్రముఖ టెక్ దిగ్గజం Samsung తన తదుపరి క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఫోన్‌ Galaxy Z Flip 8ను త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

Samsung Galaxy Z Flip 8 | శాంసంగ్ నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్.. గత మోడల్‌తో పోలిస్తే పెద్ద డిస్‌ప్లే, ప్రీమియం లుక్!

Samsung Galaxy Z Flip 8 | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఫోల్డబుల్ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ప్రముఖ టెక్ దిగ్గజం Samsung తన తదుపరి క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఫోన్‌ Galaxy Z Flip 8ను త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. తాజాగా లీకైన కేస్ రెండ్లు ఈ ఫోన్ డిజైన్‌తో పాటు పలు కీలక విషయాలను బయటపెడుతున్నాయి. ఈ మొబైల్‌ను జూలైలో జరగనున్న గెలాక్సీ అన్‌ప్యాక్‌డ్ ఈవెంట్‌లో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

లీకైన రెండర్ల ప్రకారం.. Galaxy Z Flip 8 డిజైన్ గత ఏడాది విడుదలైన Galaxy Z Flip 7కు చాలా దగ్గరగా ఉండనుంది. కాకపోతే కొన్ని మార్పులతో ప్రీమియం లుక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే గత మోడల్‌తో పోలిస్తే కొద్దిగా పొడవుగా, వెడల్పుగా, మందంగా ఉండొచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఫోన్ వెలుపలి భాగంలో పెద్ద కవర్ డిస్‌ప్లే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇది సుమారు 4.1 అంగుళాల పరిమాణంలో ఉండొచ్చు. దీని ద్వారా నోటిఫికేషన్లు చూడటంతో పాటు సెల్ఫీలు తీసుకోవచ్చు. యాప్స్‌ను కూడా వినియోగించుకోవచ్చు.

ఈ ఫోల్డబుల్ ఫోన్ వెనుక భాగంలో రెండు కెమెరాలు ఉండనున్నాయి. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 12మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాలు అందించనున్నట్లు సమాచారం. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 10మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్‌లో ఫ్లాట్ ఇన్నర్ డిస్‌ప్లే ఉండగా.. మధ్యలో హోల్ పంచ్ డిజైన్ ఇవ్వనున్నారు. ప్రధాన డిస్‌ప్లే 6.9 అంగుళాల సైజ్‌లో ఉండే అవకాశం ఉంది.

ఇక ఈ ఫోన్‌లో Qi2వైర్‌లెస్ చార్జింగ్ సపోర్టు ఉండనున్నట్లు తెలుస్తోంది. లీకైన కేస్ డిజైన్‌లో MagSafe తరహా రింగ్ కనిపించడంతో ఈ ఫోన్ Qi2 చార్జింగ్ సపోర్టు చేస్తుందని టెక్ నిపుణులు భావిస్తు్న్నారు.

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇందులో శక్తివంతమైన డెకా కోర్ ప్రాసెసర్ ఉండనుంది. ఇది 8జీబీ, 12జీబీ ర్యామ్ వేరియంట్లతో పాటు 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లతో రానున్నాయి. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4300mAh బ్యాటరీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇక ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI9 ప్రాసెసర్ ఉండనుంది. ప్రధాన డిస్‌ప్లే రిజల్యూషన్ 2520*1080 పిక్సెల్ ఉండే అవకాశం ఉంది.

Read More:

భారత్‌లోకి వచ్చేసిన మోటరోలా తొలి బుక్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్.. 50MP ట్రిపుల్ కెమెరాతో లాంచ్!

Samsung | తక్కువ ధరలోనే ప్రీమియం ఫోన్లు కావాలా.. బంపరాఫర్ ప్రకటించిన శాంసంగ్