Redmi Turbo 5 | 7560mAh భారీ బ్యాటరీ.. 100W ఫాస్ట్ చార్జింగ్‌తో రెడ్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర ఎంతంటే..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇప్పటికే చైనాలో విడుదలై మంచి ఆదరణ పొందుతున్న Redmi Turbo 5 మొబైల్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Redmi Turbo 5 | 7560mAh భారీ బ్యాటరీ.. 100W ఫాస్ట్ చార్జింగ్‌తో రెడ్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర ఎంతంటే..!

Redmi Turbo 5 | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇప్పటికే చైనాలో విడుదలై మంచి ఆదరణ పొందుతున్న Redmi Turbo 5 మొబైల్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెడ్‌మీ టర్బో సిరీస్‌లో భారత్‌లో విడుదల కానున్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. ప్రముఖ టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రెడ్‌మీ టర్బో5 మొబైల్‌ను భారత్‌లో జూన్ తొలి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. చైనాలో లాంచ్ అయిన ఫీచర్లతోనే భారత్‌లోకి రానున్నట్లు తెలుస్తోంది.

ఫీచర్లు

Redmi Turbo 5 స్మార్ట్‌ఫోన్‌లో 6.59 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 1.5K రిజల్యూషన్‌తో పాటు 120Hz రీఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. చైనీస్ వెర్షన్‌లో డాల్బీ విజన్, HDR 10+, గరిష్టంగా 3500 నిట్స్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీంతో వీడియోలు, గేమింగ్, మల్టీ మీడియా అనుభవం మరింత మెరుగ్గా ఉండనుంది.

ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్ అందించారు. ఇది హైఎండ్ గేమింగ్, మల్టీ టాస్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS3 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. చైనాలో విడుదలైన మోడల్‌లో గరిష్ఠంగా 16GB LPDDR5X ర్యామ్, 512జీబీ UFS 4.1 స్టోరేజ్ అందుబాటులో ఉంది.

కెమెరా స్పెసిఫికేషన్లు

ఫొటోగ్రఫీ పరంగా చూస్తే.. వెనుక భాగంలో 50మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ కెమెరాతో పాటు 8మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సర్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 20మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

బ్యాటరీ, ఇతర ఫీచర్లు

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7560mAH భారీ బ్యాటరీ ఉండనుంది. ఇది 100W వైర్డ్‌ ఫాస్ట్ చార్జింగ్‌తో పాటు, 27W రివర్స్ చార్జింగ్ సపోర్టు ఇస్తుంది. డిజైన్ విషయానికి వస్తే ఫ్లాట్ బ్యాక్‌ప్యానెల్, విడివిడిగా అమర్చిన రెండు కెమెరా సెన్సర్లు, LED ఫ్లాష్ మాడ్యూల్స్ ఇవ్వనున్నట్లు టీచర్‌లో కనిపిస్తోంది. ఇక కుడివైపు పవర్ బటన్, వాల్యూమ్ బటన్లు ఉండనున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ IP66, IP68, IP69, IP69K రేటింగ్స్‌తో వస్తుండటంతో నీరు, దుమ్ము నుంచి మెరుగైన రక్షణ లభించనుంది.

ధర ఎంతంటే..

చైనాలో ఈ ఫోన్ ప్రారంభ ధరను 2,299 చైనీస్ యువాన్లుగా నిర్ణయించారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.30 వేల వరకు ఉండే అవకాశం ఉందని అంచనా. ఈ మొబైల్‌ను ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ద్వారా విక్రయించనున్నట్లుగా ఇప్పటికే ప్రత్యేక మైక్రోసైట్‌ను షావోమీ ప్రారంభించింది.

Read More:

7500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ చార్జింగ్‌తో వివో నుంచి S60.. ఎప్పుడు లాంచ్ అంటే..!

భారత్‌లోకి వచ్చేసిన మోటరోలా తొలి బుక్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్.. 50MP ట్రిపుల్ కెమెరాతో లాంచ్!