Viral News | పిల్లలను ఎప్పుడు కనాలనేది భార్యాభర్తల వ్యక్తిగత విషయం. అందులో వారి తల్లిదండ్రుల జోక్యం కూడా ఉండకూడదు. అలాంటిది ఓ మహిళా టీచర్‌కు ప్రిన్సిపాల్ పెట్టిన కండీషన్ ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కొత్తగా పెళ్లయిన ఆమెను హాలీ డేస్‌లోనే పిల్లలను కనాలని రూల్ పెట్టింది. ఆ టీచర్ భర్త సోషల్‌మీడియా వేదికగా పోస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
టీచర్లు పిల్లల్ని సమ్మర్ హాలీడేస్‌కు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలా అనే శీర్షికతో ఆ మహిళా టీచర్ భర్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో పోస్టు చేశాడు. ఆ పోస్టు ప్రకారం.. ‘ వారికి కొత్తగా పెళ్లయ్యింది. దీంతో ఇటీవలే ఆమె మా రాష్ట్రానికి వచ్చింది. అంతకముందు తను ఉన్న రాష్ట్రంలో ఆమె ఎన్నో సంవత్సరాలు టీచర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అక్కడ ఆమె పనిచేసిన స్కూల్ టాప్‌లో ఉండేది.’ అని తెలిపాడు. పెళ్లయ్యాక ఆమె తన రాష్ట్రానికి రావడంతో ఇక్కడ ప్రైమరీ స్కూల్‌లో జాబ్ కోసం అప్లై చేస్తే ఇంటర్వ్యూ కాల్ వచ్చిందని పేర్కొన్నాడు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ప్రిన్సిపాల్ చేసిన వ్యాఖ్యలు తన భార్యను షాక్‌కు గురిచేశాయని చెప్పాడు.
‘మీరు కొత్తగా పెళ్లి చేసుకున్నారు. భవిష్యత్తులో పిల్లల్ని కనవచ్చు. కానీ మీరు ఒక పనిచేయండి. డెలివరీ జూన్‌లో వచ్చేలా ప్లాన్ చేసుకోండి. జూలైలో పిల్లలు పుడితే ఆగస్టులో విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే సంవత్సరానికి మీరు సిద్ధంగా ఉండకపోవచ్చు. అలాగే విద్యా సంవత్సరం మధ్యలో ప్రసూతి సెలవులపై వెళ్తే తాత్కాలిక టీచర్‌ను వెతకం ఇబ్బందిగా మారుతుంది’ అని మహిళా టీచర్‌కు ప్రిన్సిపాల్ చెప్పినట్లు ఆమె భర్త తన పోస్టులో పేర్కొన్నాడు. ఆ మాటలు విన్న తన భార్య పూర్తిగా షాక్‌కు గురైందని చెప్పాడు. కానీ ఆ సమయంలో ఏమీ మాట్లాడకుండా నవ్వేసి ఉద్యోగాన్ని అంగీకరించాల్సి వచ్చిందని తెలిపాడు.
Apparently Teachers Need to Schedule Babies for Summer Break
by
u/Cheatsheet420 in
recruitinghell
సోషల్‌మీడియాలో ఈ పోస్టు వైరల్ కావడంతో ప్రిన్సిపాల్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇంత బహిరంగంగా ఇలా అడగడం ఆశ్చర్యకరం’, ‘ఇలాంటి ప్రశ్నలు అడగడం పూర్తిగా చట్టవిరుద్ధం’ అంటూ స్పందించారు. స్కూల్ క్యాలెండర్ ప్రకారమే పిల్లలను కూడా ప్లాన్ చేసుకోవాలా అని మండిపడుతున్నారు.
Read More:
శోభనం రాత్రి భార్యను మేకప్ లేకుండా చూసి కంగుతిన్న కొత్త పెళ్లి కొడుకు..!
కోమాలో నుంచి బయటకొచ్చి ముగ్గురు పిల్లల గురించి ఆరా తీసిన టీనేజర్.. షాక్‌లో పేరెంట్స్!
