• Telugu News
  • /Trending

Viral Video | 9 నెలల గర్భంతో క్లిష్టమైన యోగాసనాలు.. డెలివరీకి ముందు చక్రాసనం వేసి షాక్ ఇచ్చిన బెంగళూరు మహిళ

Viral Video | 9 నెలల గర్భంతో బెంగళూరు మహిళ చక్రాసనం సహా పలు క్లిష్టమైన యోగాసనాలు వేసి షాకిచ్చింది. చీరకట్టులో తన యోగాసనాలు వేసిన వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో.. అవి చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

Reported by: Chandram | ట్రెండింగ్ | Jun 04, 2026, 8:53 pm IST
Read Time: 5 mins
Viral Video | 9 నెలల గర్భంతో క్లిష్టమైన యోగాసనాలు.. డెలివరీకి ముందు చక్రాసనం వేసి షాక్ ఇచ్చిన బెంగళూరు మహిళ

Viral Video | సాధారణంగా 9 నెలల గర్భిణీ అంటే మాములుగా నడవడమే కష్టంగా భావిస్తారు. వీలైనంత వరకు ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటారు. కానీ బెంగళూరుకు చెందిన ఓ మహిళ చక్రాసనం సహా పలు క్లిష్టమైన యోగాసానాలను అత్యంత ఈజీగా వేసింది. అది కూడా చీరకట్టుకుని ఈ యోగా చేశారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. డెలివరీకి కొద్దిరోజుల ముందు ఆమె చేసిన ఈ సాహసాన్ని చూసి నెటిజన్లు ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు.

బెంగళూరుకు చెందిన యోగా టీచర్ శశి ప్రభ ద్వివేది ఈ వీడియోలను పంచుకున్నారు. ఇందులో ఆమె సంప్రదాయబద్ధంగా ఆకుపచ్చ చీరను ధరించారు. ఆ చీరకట్టులోనే చక్రాసనం సహా పలు క్లిష్టమైన ఆసనాలనున ఎంతో సునాయసంగా వేశారు. ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. తన యోగా సాధన వెనుక ఉన్న అనుభవాన్ని క్యాప్షన్‌లో వివరించారు.

39 వారాలు.. తొమ్మిది నెలల గర్భం.. ఇదే నా వాస్తవం. చాలామంది ఈ ఆసనాలే చూస్తారు. కానీ వాటి వెనుక సంవత్సరాల తరబడి చేసిన సాధన, శారీరక బలం, అవగాహన, సహనరం, నా శరీరంపై నాకు నమ్మకం ఉన్నాయని చూడరు అని క్యాప్షన్ రూపంలో పేర్కొన్నారు. గర్భవతిగా ఉన్న సమయంలో తాను ఎవరినో ఆకట్టుకోవడానికి లేదా ఏదో నిరూపించుకోవడానికి ప్రయత్నించడం లేదని తెలిపారు. తనకు అనుకూలంగా అనిపించేవిధంగా శరీర కదలికలతో అనుసంధానమై ఉండటమే లక్ష్యమని చెప్పారు. ప్రతి గర్భధారణ భిన్నంగా ఉంటుంది.. తనలా ఎవరైనా ఈ సమయంలో వ్యాయామం లేదా యోగా చేయాలని అనుకుంటే ముందుగా వైద్య నిపుణులను సంప్రదించాలని సూచించారు. కాగా శశిప్రభ పోస్టు చేసిన ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోకు 2.1 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

 


39వారాల గర్భంతో శశిప్రభ చేసిన యోగాసనాలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. పలువురు ఆమె సాహసాన్ని ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది పుట్టబోయే బిడ్డకు సురక్షితమేనా? వ్యూస్ కోసం ఇలా చేయకుండా శిశువు గురించి ఆలోచించాలని ఓ నెటిజన్ సూచించారు. మీ ప్రతిభను గౌరవిస్తాం.. కానీ ప్రెగ్నెన్సీ సమయంలో ఈ విధంగా ప్రదర్శించడం సరికాదని మరో నెటిజన్ హితవుపలికారు. ఫిట్‌నెస్ ముఖ్యమైన కానీ బిడ్డ భద్రత కంటే ఎక్కువ కాదని మరికొందరు అభిప్రాయపడ్డారు. ప్రసవానికిముందు ఇలాంటి అడ్వాన్స్‌డ్ యోగాససనాలు తల్లీబిడ్డ ఇద్దరికీ ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరు నెటిజన్లు మాత్రం శశిప్రభకు మద్దతు తెలుపుతున్నారు.

Read More:

Pregnant women | గర్భిణీలు ఆ ఫుడ్స్‌ జోలికి అస్సలు వెళ్లొద్దు.. ఎందుకో తెలుసా..?

Pregnancy Tourism | ఆ ఊరి మ‌గాళ్ల కోసం విదేశీ యువ‌తుల క్యూ