Pregnancy Tourism | ఆ ఊరి మ‌గాళ్ల కోసం విదేశీ యువ‌తుల క్యూ

Pregnancy Tourism | ఆ ఊరికి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. అక్క‌డున్న అబ్బాయిల కోసం విదేశీ యువ‌తులు క్యూ క‌డుతున్నారు. ఎందుకంటే.. ఆ ఊరి మ‌గాళ్ల‌తో సంభోగంలో పాల్గొనేందుకు. మ‌రి డ‌బ్బులిచ్చి వారితో ఏకాంతంగా గ‌డుపుతున్నారు. ఏదో సుఖం కోసం విదేశీ యువతులు ఆ ఊరి యువ‌కులతో సంభోగం చేయ‌ట్లేదు. కేవ‌లం గ‌ర్భం దాల్చ‌డం కోస‌మే. మ‌రి ఎందుకు ఆ ప్ర‌త్యేక‌త అంటే.. ఆ ఊరి మ‌గాళ్లు ఆరు అడుగుల అజానుబాహులు.. కండ‌లు తిరిగిన యోధులు. అలాంటి […]

Pregnancy Tourism | ఆ ఊరి మ‌గాళ్ల కోసం విదేశీ యువ‌తుల క్యూ

Pregnancy Tourism | ఆ ఊరికి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. అక్క‌డున్న అబ్బాయిల కోసం విదేశీ యువ‌తులు క్యూ క‌డుతున్నారు. ఎందుకంటే.. ఆ ఊరి మ‌గాళ్ల‌తో సంభోగంలో పాల్గొనేందుకు. మ‌రి డ‌బ్బులిచ్చి వారితో ఏకాంతంగా గ‌డుపుతున్నారు. ఏదో సుఖం కోసం విదేశీ యువతులు ఆ ఊరి యువ‌కులతో సంభోగం చేయ‌ట్లేదు. కేవ‌లం గ‌ర్భం దాల్చ‌డం కోస‌మే. మ‌రి ఎందుకు ఆ ప్ర‌త్యేక‌త అంటే.. ఆ ఊరి మ‌గాళ్లు ఆరు అడుగుల అజానుబాహులు.. కండ‌లు తిరిగిన యోధులు. అలాంటి ల‌క్ష‌ణాలు ఉన్న పిల్ల‌ల‌ను క‌నాల‌నే ఉత్సాహంతోనే ఆ ఊరికి విదేశీ యువ‌తులు క్యూ క‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ ఊరికి ప్రెగ్నెన్సీ టూరిజం స్పాట్‌గా పేరు వ‌చ్చింది. మ‌రి ఆ ఊరు వివ‌రాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ..

ల‌ఢ‌క్‌లోని సింధూ న‌ది ఒడ్డున ఉండే బియామా, దాహ్, హానూ, దార్చిక్ లాంటి గ్రామాల్లో బ్రోక్పా స‌ముదాయానికి చెందిన ప్ర‌జ‌లు జీవిస్తున్నారు. 5 వేల జ‌నాభాతో కూడిన‌ వీరిని చిట్ట చివ‌రి ఆర్యులుగా చెప్పుకుంటారు. పురాణాల్లో విన్న‌ట్లు ఆర్యులు అంటే అజానుబాహులని, అంద‌గాళ్ల‌ని పేరుంది. ఇలాంటి ల‌క్ష‌ణాలు ఉన్న పిల్ల‌ల‌ను క‌నాల‌నే ఉద్దేశంతో విదేశీయులు ఆ గ్రామాల్లో వాలిపోతున్నారు. ఏకంగా ఆ ఊర్ల మ‌గాళ్ల‌కు డ‌బ్బులిచ్చి ఏకాంతంగా గ‌డుపుతున్నారు. తాము క‌ల క‌న్న కోరిక‌ను నెర‌వేర్చుకుంటున్నారు. మ‌రి ముఖ్యంగా యూర‌ప్‌, జ‌ర్మ‌న్ మ‌హిళ‌లే ఇక్క‌డికి వ‌స్తున్నార‌ని స్థానికులు తెలిపారు.

ఆర్య‌జాతి మాన‌వ‌జాతిలోనే స్వ‌చ్ఛ‌మైన జాతి అని యూర‌ప్‌లో హిట్ల‌ర్ కాలం నుంచి ప్రాచుర్యంలో ఉంది. భూమిపై ఉన్న మాన‌వులంద‌రిలో ఆర్య‌న్ల‌లోనే అత్యంత స్వ‌చ్ఛ‌మైన ర‌క్తం ఉంద‌ని జ‌ర్మ‌న్ నాజీలు న‌మ్ముతారు. ఆర్యుల జాతికి చెందిన మగవాళ్లు చాలా ఎత్తుతో పాటు, కండలు తిరిగిన దేహంతో ఉంటారని ప్రసిద్ధి. అంతేకాదు.. బంగారు రంగులో చర్మంతో పాటు జుట్టు ఎరుపు కలర్‌లో, కళ్లు నీలి రంగులో ఉంటాయి. మిగతా లద్దాఖ్ వాసులతో పోలిస్తే బియామా, గార్కొనే దార్చిక్ దాహ్, హానూ లాంటి గ్రామాల్లో ప్రజల ముఖాలు చాలా భిన్నంగా కనిపిస్తాయి. ఇలాంటి వారితో సంభోగంలో పాల్గొని ఆర్యజాతికి చెందిన బిడ్డకు జన్మనివ్వాలని విదేశీ మహిళలు కోరుకుంటున్నారు.

అయితే కొన్నేండ్ల‌ క్రితం ఓ జ‌ర్మ‌నీ మ‌హిళ‌.. దాహ్‌ గ్రామంలో ఆర్యులు ఉన్నారన్న విషయం తెలుసుకుంది. దీంతో ఆమె దాహ్‌కు వ‌చ్చి చాలా రోజుల పాటు ఆర్యుల జాతికి చెందిన మ‌గాళ్ల‌తో గ‌డిపింది. గ‌ర్భం దాల్చాకే దాహ్ నుంచి వెళ్లింద‌ని తెలుస్తోంది. ఆమెకు ఓ బాబు జన్మించాడని, ఆ తర్వాత ఈ విషయం ప్రపంచంలోని చాలా మందికి తెలిసిన్నట్లు దాహ్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తెలిపాడు. ఆ తర్వాత క్రమంగా విదేశీ యువతులు ఈ చుట్టుముట్టు గ్రామాల్లో ఉన్న ఆర్యుల వద్దకు రావడం.. గర్భం దాల్చడం, ఇక్కడి నుంచి తిరిగి వెళ్లడం జరుగుతుందని తెలిపారు.