Vastu Tips | తలుపు వెనుకాల బట్టలు తగిలిస్తున్నారా..? దంపతుల మధ్య విభేదాలు తప్పవట..! జరజాగ్రత్త..!!
Vastu Tips | ఇంటి ఇంటిరీయర్( House Interior ) విషయంలో వాస్తు నియమాలు( Vastu Tips ) పాటించకపోతే అనేక సమస్యలు ఏర్పడుతాయని వాస్తు నిపుణులు( Vastu Experts ) హెచ్చరిస్తున్నారు. చిన్న చిన్న వాస్తు దోషాల వల్ల ఇంట్లో చికాకులు, గొడవలు సంభవిస్తాయట.

Vastu Tips | ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకుంటాం. కానీ ఇంటిరీయర్( House Interior ) విషయంలో చిన్నచిన్న పొరపాట్లు చేస్తుంటాం. అది చెప్పుల స్టాండ్ కావొచ్చు.. ఎక్వేరియం కావొచ్చు.. అద్దం ఉంచే ప్లేస్ కావొచ్చు.. ఇలా ఎన్నో తప్పిదాలు చేస్తుంటాం. మరి ముఖ్యంగా.. బట్టలు తగిలించే హ్యాంగింగ్స్( Cloth Hangings ) విషయంలో పొరపాటు చేస్తుంటాం. చాలా మంది తమ బెడ్రూం డోర్( Bedroom Door ) వెనుకాల హ్యాంగింగ్స్( Hangings ) ఏర్పాటు చేసుకుంటుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తి, దంపతుల( Couples ) మధ్య విభేదాలకు దారి తీస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు.
ఈ పొరపాట్లు అసలు చేయకూడదు..
చాలా మంది ఇంటి బెడ్రూం డోర్స్‌కి వాల్ హ్యాంగింగ్స్ ఏర్పాటు చేస్తారు. ఇలా చేయడం వల్ల మెస్సీగా కనిపించదు అనుకుంటారు. కానీ ఇలా పెట్టడం చాలా తప్పని వాస్తు శాస్త్రం చెబుతుంది.
ఉపయోగించిన దుస్తులను, విడిచిన బట్టలను తప్పనిసరిగా వాషింగ్ ఏరియాలోనే ఉంచాలని చెబుతున్నారు. అలాగని ఉతికిన బట్టలను డోర్ వెనుకాల తగిలించకూడదు.
అదే విధంగా కొన్ని రకాల వస్తువులను కూడా తగిలిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పురోగతి అనేది కుంటు పడుతుందట. వాస్తు ప్రకారం ఇంటి ద్వారం లక్ష్మీ దేవికి స్థానంగా చెబుతూ ఉంటారు. ఇలా డోర్ వెనుక భాగంలో హ్యాంగర్లు ఏర్పాటు చేయకూడదట.
అంతే కాకుండా ఖాళీగా ఉందని డోర్ల మీద కూడా టవల్స్, బట్టలు ఆరేస్తూ ఉంటారు. ఇలా కూడా చేయకూడదట. ఇలాంటి చిన్న తప్పుల వలనే.. ఇంట్లో ఆర్థిక సమస్యలు, చికాకులు కూడా ఏర్పడతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.