Vastu Tips | పడక గదిలో ఈ రంగు ఉంటే.. భార్యాభర్తల మధ్య గొడవలే!
Vastu Tips | దంపతులకు( Couples ) పడక గది( Bed Room ) చాలా ముఖ్యం. బెడ్రూం నిర్మాణంతో పాటు ఆ గదికి వేసే రంగులు( Colours ) కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే రంగులు కూడా ఆ దంపతుల సంసార జీవితంపై ప్రభావం చూపుతాయట. ఈ రంగు ఉపయోగిస్తే.. నిత్యం భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయట.

Vastu Tips | ఇల్లు( House ) నిర్మించే ప్రతి ఒక్కరూ.. బెడ్రూం( Bed Room ), కిచెన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వాస్తుకు( Vastu Tips ) అనుగుణంగా నిర్మాణం చేస్తుంటారు. కొందరు వాస్తు ప్రకారం పడక గది( Bed Room ) ఏర్పాటు చేసుకున్నప్పటికీ.. అందులో వేసే రంగుల( Colours ) విషయంలో పొరపాట్లు చేస్తుంటారు. అంతేకాకుండా బెడ్రూంలో ఇష్టారీతిన ఏ వస్తువులు అంటే ఆ వస్తువులు పెడుతుంటారు. ఇలా ఇష్టమొచ్చిన రంగులు, ఇష్టమొచ్చిన వస్తువులను ఉంచడం వల్ల.. ఆ ఇంటి దంపతుల( Couples ) మధ్య కలహాలు ఏర్పడడమే కాకుండా, ఆర్థిక కష్టాలు కూడా వచ్చి పడుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి బెడ్రూం ఎలా ఉండాలో తెలుసుకుందాం.
దుప్పుట్లు ఈ రంగులో ఉండొద్దు..
పడకగదిలో బెడ్ మీద ఉపయోగించే దుప్పట్లు నలుపు, నీలం రంగులో ఉండకుండా చూసుకోవాలి. ఈ రంగుల్లో ఉంటే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశించి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందంటున్నారు. అలాగే, మంచం మీద ఉపయోగించే దుప్పట్లకు త్రిభుజాకారం, ఏదైనా కోణం ఆకారంలో గుర్తులు ఉండకుండా చూసుకోవాలట.
పడకగదిలో ఈ రంగు వద్దే వద్దు..
చాలా మంది పడకగది సీలింగ్‌కు నీలం రంగు వేయించుకుంటారు. ఎందుకంటే రాత్రిళ్లు ఆకాశం చూస్తున్న ఫీలింగ్‌తో గడిపేయాలనే ఆలోచనతో. కానీ ఈ బ్లూ కలర్ వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడుతాయట. ఎప్పుడైనా సరే బెడ్రూమ్లో నారింజ, పసుపు, ఎరుపు రంగు వంటివి ఉండేలా చూసుకోవాలి. అప్పుడు దంపతుల మధ్య అనుకూలత చాలా బాగుంటుందట.
మొక్కలు మంచిది కాదు..
మొక్కలు ఉండకూడదట. ప్లాస్టిక్ కుండీలు బెడ్రూమ్లో ఉంటే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.
నీళ్ల ఫొటోలకు తావివ్వొద్దు..
బెడ్రూమ్లో నీళ్లకు సంబంధించిన ఫొటోలు ఉండకూడదు. అంటే, వాటర్ ఫౌంటెయిన్, పర్వతాల నుంచి వాటర్ జారుతున్నట్లు ఉన్న చిత్రాలు ఉండడం అంత మంచిది కాదంటున్నారు.
పనికిరాని వస్తువులను మంచం కింద పెట్టొద్దు..
కొందరు మంచం కింద పాత సూట్‌కేసులు, పాత సామానులు వంటి కొన్ని పనికిరాని వస్తువులు పెడుతుంటారు. ఇలా పనికిరాని వస్తువులను కాట్ కింద ఉంచడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.