Vastu Tips | ఈశాన్య దిశలో పడక గదా..! దంపతుల మధ్య విడాకులు తప్పవట..!!
Vastu Tips | ఇంటిని వాస్తు నియమాల( Vastu Tips ) ప్రకారం నిర్మించకపోతే.. అత్యంత ప్రమాదకరమని వాస్తు నిపుణులు( Vastu Experts ) హెచ్చరిస్తున్నారు. మరి ముఖ్యంగా పడక గది( Bed Room ) విషయంలో వాస్తు నియమాలు పాటించాలని, లేని యెడల దంపతులు విడాకులు( Divorce ) తీసుకునే ఆస్కారం ఉందని అంటున్నారు. మరి ఏ దిశలో పడక గది ఉండాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
Vastu Tips | దంపతుల మధ్య సంసార జీవితం సాఫీగా సాగాలన్నా, ఆ కుటుంబం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లాలన్న పడక గది( Bed Room ) చాలా ముఖ్యం. దాంపత్య జీవిత రహస్యాలతో పాటు అన్ని విషయాలకు చర్చా వేదికగా పడక గది ఉంటుంది. మరి అంతటి ప్రాధాన్యత కలిగిన బెడ్రూం విషయంలో కచ్చితంగా వాస్తు నియమాలు( Vastu Tips ) పాటించాల్సిందే. ఈ ఒక్క పడక గది విషయంలో వాస్తు నియమాలు పాటించకపోతే దంపతుల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. అదొక్కటే కాదండోయ్.. విడాకులు( Divorce ) కూడా తీసుకునే ప్రమాదం ఉందని వాస్తు నిపుణులు( Vastu Experts ) హెచ్చరిస్తున్నారు. మరి పడక గది విషయంలో తీసుకోవాల్సిన వాస్తు నియమాలను తెలుసుకుందాం.
దక్షిణం వైపున చీకటి ఉండొద్దు..
దంపతులు అన్యోన్యంగా జీవించాలన్న, కలహాలు రావొద్దన్నా.. ఇంట్లోని దక్షిణ దిశ చాలా కీలకమైనది. ఈ దిశను ఎప్పుడు కూడా చీకట్లో ఉంచకూడదు. ఎల్లప్పుడూ వెలుతురు ఉండేలా చూసుకోవాలి. లేదంటాఏ సంబంధాలను ప్రభావితం చేస్తుంది. భార్యాభర్తల బంధంలో చీలికలు ఏర్పడే ప్రమాదం ఉంది. అంతే కాకుండా దక్షిణం వైపు నీలం లేదా తెలుపు రంగులో పెయింట్ చేయడం వల్ల దంపతుల మధ్య బంధం బలోపేతం అవుతుందని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.
ఈశాన్య దిశలో పడక గది ఉండొద్దు..
వాస్తు నియమాల ప్రకారం.. పడక గదికి ఈశాన్య దిశ మంచిది కాదట. ఈ దిశలో తల కిందికి చూస్తూ పడుకోవడం అస్సలే మంచిది కాదట. దీని వల్ల దంపతుల నిద్రకు భంగం కలుగుతుంది. ఘర్షణలు ఏర్పడుతాయి. మానసిక సంఘర్షణ ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. ముఖ్యంగా ఈశాన్య దిశలో బెడ్ రూమ్ ఉండటం విడాకులకు దారి తీస్తుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram