Gulf Countries | గల్ఫ్ దేశాల అసలు బలహీనత బయటపడింది.. యుద్దంలో తాగునీటి ప్లాంట్లు కాపాడుకోవడమే మెయిన్ టాస్క్!

Gulf Countries | మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల అసలు బలహీనత ఏంటో బయటపడింది. చమురు నిల్వల కంటే తాగునీటిని కాపాడుకోవడమే క్షిపణుల దాడి నుంచి కాపాడుకోవడమే అతి పెద్ద టాస్క్ అని నిపుణులు చెబుతున్నారు.

Reported by: Chandram | అంత‌ర్జాతీయం | Mar 09, 2026, 7:29 pm IST
Read Time: 6 mins
Gulf Countries | గల్ఫ్ దేశాల అసలు బలహీనత బయటపడింది.. యుద్దంలో తాగునీటి ప్లాంట్లు కాపాడుకోవడమే మెయిన్ టాస్క్!

Gulf Countries | మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల అసలు బలహీనత ఏంటో బయటపడింది. ఇంతకాలం ఈ దేశాలపై దాడి చేయాలంటే వాటి ప్రధాన ఆదాయ వనరు అయిన చమురుపై దాడి చేస్తే దెబ్బకొట్టవచ్చని అంతా భావించారు. కానీ తాజా పరిస్థితులు చూస్తే చమురు కంటే వారి పెద్ద బలహీనత తాగునీరే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ యుద్ధంలో గల్ప్ దేశాల్లోని డీసాలినేషన్ ప్లాంట్లు దెబ్బతింటే భారీ మానవ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

డీసాలినేషన్ ప్లాంట్లు అంటే ఏంటి?

గల్ప్ దేశాల్లో తాగునీటి వనరులు చాలా తక్కువ. నదులు, పెద్ద సరస్సులు లేనందున అక్కడి నగరాలు సముద్రపు నీటిలోని ఉప్పు, ఇతర ఖనిజాలను తొలగించి తాగునీటిగా మార్చుకుంటాయి. ఈ పద్ధతిని రివర్స్ ఒస్మోసిస్ అని పిలుస్తారు. ఈ ప్రక్రియలో నీటిని ప్రత్యేక మెంబ్రేన్ ఫిల్టర్ల ద్వారా పంపించి ఉప్పును వేరుచేస్తారు. ఈ విధంగా శుద్ధి చేసిన నీటిని ఇళ్లకు, పరిశ్రమలకు, హోటళ్లకు సరఫరా చేస్తారు.

ఇవి ఎందుకు కీలకం?

గల్ఫ్ ప్రాంతంలోని చాలా దేశాలకు నదులు, సరస్సులు వంటి తాగునీటి వనరులు లేవు. అందుకే డీసాలివేషన్ ప్లాంటప్లైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. కువైట్‌లో సుమారు 90 శతం తాగునీరు డీసాలినేషన్ నుంచే వస్తుంది. ఇక ఒమన్‌లో సుమారు 86 శాతం, సౌదీ అరేబియాలో సుమారు 70 శాతం తాగునీటి కోసం ఈ డీసాలినేషన్ ప్లాంట్లపై ఆధారపడుతున్నారు. ఒకవేళ ఈ డీసాలినేషన్ ప్లాంట్లు పనిచేయకపోతే కొన్ని రోజుల్లోనే ప్రధాన నగరాల్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే అంతముఖ్యమైన ఈ ప్లాంట్లు యుద్ధ సమయంలో దెబ్బతింటే ఆ దేశాల్లో భారీ సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

యుద్ధ సమయంలో ఎందుకు ప్రమాదం

డీసాలినేషన్ ప్లాంట్లలో చాలా భాగం పర్షియన్ గల్ఫ్ తీర ప్రాంతాల్లోనే ఉన్నాయి. అందువల్ల యుద్ధ సమయంలో అవి సులువుగా క్షిపణి లేదా డ్రోన్ల దాడులకు గురయ్యే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన దాడుల్లో దుబాయ్‌లోని జెబెల్ లీ పోర్టు సమీపంలోని భారీ డీసాలినేషన్ ప్లాంట్‌కు దగ్గరలో క్షిపణులు పడినట్లు సమాచారం. యూఏఈలోని ఫుజైరా F1 పవర్ అండ్ వాటర్ కాంప్లెక్స్, కువైట్‌లోని దోహా వెస్ట్ డీసాలినేషన్ ప్లాంట్ ప్రాంతాల్లో కూడా నష్టం జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. అలాగే చాలా డీసాలినేషన్ ప్లాంట్లు విద్యుత్ కేంద్రాలతో అనుసంధానంగా ఉండటం వల్ల విద్యుత్ స్టేషన్లపై దాడులు జరిగితే నీటి ఉత్పత్తి కూడా నిలిచిపోవచ్చని తెలుస్తోంది.

90 శాతం నీటికి అవే కీలకం!

ఒక విశ్లేషణ ప్రకారం.. గల్ఫ్ ప్రాంతాల్లో తయారయ్యే డీసాలినేషన్ నీటిలో 90 శాతం వరకు కూడా కేవలం 56 ప్లాంట్ల నుంచే వస్తోంది. ఒకవేళ వాటిలో ఏదైనా పెద్ద ప్లాంట్ దెబ్బతింటే దేశవ్యాప్తంగా నీటి సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ డీసాలినేషన్ ప్లాంట్లు పనిచేయకుండాపోతే కొద్దిరోజుల్లోనే పెద్ద నగరాల్లో తాగునీటి సంక్షోభం తలెత్తుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే గల్ఫ్ దేశాలకు చమురు కంటే డీసాలినేషన్ ప్లాంట్లే అత్యంత కీలకమని చెబుతున్నారు.

 

Read More :

Chai Guy | లేఆఫ్‌లో ఉద్యోగం పోతే.. అమెరికాలో ఛాయ్ అమ్ముతూ సక్సెస్ అయ్యాడు!

Floating Village | భారత్‌లోనే నీటిపై తేలియాడే ఏకైక గ్రామం.. దీని విశేషాలు తెలుసా!