HMWSSB | పగిలిన మంజీరా పైపులైన్.. హైదరాబాద్‌లో నీటి సరఫరాకు అంతరాయం..!
HMWSSB | హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎందుకంటే మంజీరా ఫేజ్ -2 పరిధిలోని ప్రధాన పైపులైన్ పగిలిపోవడం కారణంగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.
HMWSSB | హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎందుకంటే మంజీరా ఫేజ్ -2 పరిధిలోని ప్రధాన పైపులైన్ పగిలిపోవడం కారణంగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. జాతీయ రహదారుల విస్తరణ పనుల నేపథ్యంలో పైపులైన్‌కు రంధ్రం పడిందని, దీంతో పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు.
రామచంద్రాపురం, అశోక్‌నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్‌పూర్, భాగ్యనగర్ కాలనీ, ఎర్రగడ్డ, ఎస్ ఆర్ నగర్, అమీర్‌పేట, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, ప్రగతి నగర్ ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేశారు. పనులకు మరమ్మతులు చేపట్టిన వెంటనే నీటిని సరఫరా చేస్తామన్నారు.
ఈ మేరకు జలమండలి ఒక ప్రకటన విడుదల చేసింది. జలమండలి అధికారులు అత్యవసర మరమ్మతులను చేపట్టారు. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేసి నీటి సరఫరా చేస్తామన్నారు. ఎండీ అశోక్ రెడ్డి స్వయంగా పనులను పరిశీలించి, పైపులైన్ పనుల పురోగతిని సమీక్షించారు. పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి, నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తయిన వెంటనే, దశలవారీగా నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు పేర్కొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram