Vastu Tips | పడక గది ఈ రంగులో ఉంటే.. దాంపత్య జీవితమంతా మధురమేనట..!
Vastu Tips | దాంపత్య జీవితానికి( Couples Life ) సంపద ఒక్కటే సరిపోదు. సంపద( Wealth )తో పాటు మానసిక ప్రశాతంత కూడా ముఖ్యమే. ఆ మానసిక ప్రశాంతత కలగాలంటే.. దంపతులు నిద్రించే పడక గది( Bed Room ) కూడా ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే దాంపత్య జీవితం కూడా సాఫీగా సాగిపోతుందని వాస్తు పండితులు( Vastu Experts ) చెబుతున్నారు.

Vastu Tips | కొత్త ఇల్లును నిర్మించుకున్నప్పుడు.. ప్రతి ఒక్కరూ తమ బెడ్రూమ్( Bed Room )ను అందంగా తీర్చిదిద్దుకునేందుకు ఆరాటపడుతుంటారు. పడక గదిలో ఇంటిరీయర్‌కు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. బెడ్ ఎలా ఉండాలి..? ఏ దిశలో మంచం ఉండాలి..? పడక గది నాలుగు గోడలతో పాటు సీలింగ్‌కు ఏ రంగు వేయాలనేది కూడా ముఖ్యమే. ఈ రంగులు( Colours ) దంపతుల జీవితాలను మారుస్తాయని వాస్తు పండితులు( Vastu Experts ) పేర్కొంటున్నారు. మరి పడక గదికి ఏ రంగు వేయాలి..? అనే విషయాన్ని సమగ్రంగా తెలుసుకుందాం.
ఇంట్లో నిర్మించుకునే పడక గది ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. పడక గది నాలుగు గోడలతో పాటు సీలింగ్ కూడా గులాబీ రంగు( Pink Colour ) లేదా లేత నీలిరంగు వేయాలని పండితులు సూచిస్తున్నారు. ఈ రెండు రంగులు దంపతుల మధ్య ఎల్లప్పుడూ.. దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని పెంచుతాయని చెబుతున్నారు. అంతేకాకుండా దంపతుల మధ్య మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ రెండు రంగులను మిస్ కాకుండా చూసుకుంటే మంచిదని పండితులు అభిప్రాయపడుతున్నారు.
ఇక పిల్లలకు సంబంధించిన గదిని లేత ఆకుపచ్చ లేదా ఆకాశ నీలం రంగులో ఉండేలా ప్లాన్ చేసుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. లేత రంగు సృజనాత్మకతను పెంచుతుంది. అంతేకాకుండా పిల్లలకు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుందని పండితులు అభిప్రాయపడుతున్నారు.
పూజ గది కూడా తెలుపు లేదా పసుపు రంగులో ఉండేలా చూసుకోవాలి. ఈ రెండు రంగులు కూడా ఆధ్యాత్మిక శక్తిని పెంచుతాయట. ధ్యానం చేసేందుకు కూడా వీలుగా ఈ రంగు ఉంటుందని చెబుతున్నారు.