Vastu Tips | పడకగదిలో భార్యాభర్తల మధ్య గొడవలా..? వంట గదిలో ఇవి ఉంచండి..!
Vastu Tips | భార్యాభర్తల( Couples ) మధ్య గొడవలు సహజం. కానీ కొన్ని కుటుంబాల్లో నిత్యం గొడవలే( Fighting ). ఇలా గొడవలతో సతమతమయ్యే దంపతులు వంటింట్లో చిన్న చిట్కా( Vastu Tips ) పాటిస్తే.. అన్ని సమస్యలు తొలగిపోతాయి.

Vastu Tips | దంపతులు( Couples ) ఎవరైనా సరే సుఖసంతోషాలతో ఉండాలనుకుంటారు. కానీ అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు( Fighting ) చోటు చేసుకుంటుంటాయి. క్షణాల్లో ఆ గొడవలు ఆవిరైపోతుంటాయి. కానీ కొందరి దంపతుల మధ్య నిత్యం ఘర్షణలు చెలరేగుతూనే ఉంటాయి. అవి రోజుల తరబడి, నెలల తరబడి పరిష్కారం కావు. పడకగది( Bedroom )లో నిత్యం భార్యాభర్తలు గొడవ పడుతూనే ఉంటాయి. ఇలా ఘర్షణ పడే దంపతులు.. వంటింట్లో చిన్న చిట్కా( Vastu Tips ) పాటిస్తే.. గొడవలకు చెక్ పెట్టొచ్చని పండితులు చెబుతున్నారు.
దంపతులు పాటించాల్సిన చిట్కాలు ఇవే..
ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా వంట గదిని మరింత క్లీన్‌గా ఉంచుకోవాలి. ఇంటి వంట గది ఎప్పుడూ ఆగ్నేయ దిశలోనే నిర్మించాలి. లేకపోతే ఇంట్లో గొడవలు జరగడం, మనస్పర్థలు రావడం సహజమైపోతోంది.
వంటగదిని చాలా మంది ఈశాన్య దిశలో ఏర్పాటు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయట. ఇంట్లో కుటుంబ సభ్యులు సఖ్యత కూడా కోల్పోతూ ఉంటారు.
వాస్తు ప్రకారం కిచెన్ ఎప్పుడూ ఆగ్నేయ దిశలో తూర్పుకు తిరిగి వంట చేస్తూ ఉండాలి. ఇదే సరైన నియంగా చెబుతూ ఉంటారు. చాలా మందికి తెలియకుండా గ్యాస్ స్టవ్ పక్కన, సింగ్ దగ్గర ఇతర వస్తువులు కూడా పెడుతూ ఉంటారు. ఇలా అస్సలు పెట్టకండి.
ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటే.. మీ వంట గదిలో నల్ల నువ్వులు లేదా నల్ల మిరియాలను ఒక మూట కట్టి పక్కన పెట్టాలి. అప్పుడప్పుడు వాటికి అగరుబత్తీలు చూపిస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఇంట్లో గొడవలు తగ్గుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు.