Vastu Tips | పడక గదిలో పూర్వీకుల ఫొటోలు ఉండొచ్చా..?
Vastu Tips | ఇంటిలోని కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలంటే.. వాస్తు నియమాలు( Vastu Tips ) తప్పక పాటించాల్సిందే. మరి ముఖ్యంగా పడక గది( Bed Room ) విషయంలోనూ వాస్తు నియమాలు పాటించాల్సిందే. లేదంటే ఆ ఇంటి దంపతులకు( Couples ) మనశ్శాంతి కరువైతుంది. కాబట్టి బెడ్రూం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
Vastu Tips | పడక గది వాస్తు నియమాల( Vastu Tips ) ప్రకారం ఉంటే ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది. అయితే బెడ్రూం( Bedroom )లో ఉంచే కొన్ని వస్తువుల విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే ఇంట్లోకి ప్రతికూల శక్తులు( Negative Energy ) ప్రవేశించి.. అనేక రకాల ఆటంకాలు ఏర్పడుతాయి. మరి ముఖ్యంగా పూర్వీకుల ఫొటోలు( ancestors photos ), పగిలిన గాజు ముక్కలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, పదునైన వస్తువులను పడక గదిలో ఉంచుకోవద్దు. ఇవి వాస్తు దోషాలను సృష్టించి, ఇంటి ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తాయి.
పూర్వీకుల ఫొటోలు..
చాలా మంది తమ పడక గదిలో పూర్వీకుల ఫొటోలను ఉంచుతారు. పొద్దున్నే వారి ముఖాలను చూస్తుంటారు. ఇలా బెడ్రూంలో పూర్వీకుల ఫొటోలను ఉంచడం సముచితం కాదు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. పూర్వీకుల ఫొటోలు పడక గది గోప్యతను ప్రభావితం చేస్తాయని అంటున్నారు. ఇలాంటి ఫొటోలను లివింగ్ రూమ్‌లో ఉంచడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.
పదునైన వస్తువులు
పదునైన వస్తువులను పడకగదిలో ఎప్పుడూ ఉంచకూడదు. ఎందుకంటే అవి సంబంధాలలో ఉద్రిక్తత, సంఘర్షణను పెంచుతాయి. ఈ వస్తువులు దూకుడు, కోపాన్ని పెంచుతాయని దీని వలన ప్రేమ సంబంధాలలో దూరం పెరుగుతుందని చెబుతారు. మరి ముఖ్యంగా దంపతుల మధ్య కలహాలకు కారణమవుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
పగిలిన గాజు
పడక గదిలో పగిలిన గాజులు, అద్దాలు, కిటికీ అద్దాలు వంటివి ఉంచకూడదు. ఇవి ప్రతికూల శక్తికి దోహదం చేస్తాయి. ఇది వాస్తు లోపాలను సృష్టించడమే కాకుండా మీ సంబంధాలను కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి, మీ బెడ్ రూమ్ లో ఏదైనా పగిలిన గాజు లేదా పగిలిన అద్దాలు ఉంటే, వెంటనే వాటిని మార్చండి.
ఎలక్ట్రానిక్ పరికరాలు
బెడ్‌రూమ్‌లో టీవీ, ల్యాప్‌టాప్, మొబైల్ ఛార్జర్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉంచకూడదు. ఈ పరికరాలు విద్యుదయస్కాంత తరంగాలను విడుదల చేస్తాయి. ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. సానుకూల శక్తిని దెబ్బతీస్తాయి. ఈ వస్తువులను బెడ్‌రూమ్‌లోకి రాకుండా ఉంచడానికి ప్రయత్నించండి. అవసరమైతే, పడుకునే ముందు వాటిని ఆఫ్ చేసి, మంచం నుండి దూరంగా ఉంచండి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram