Nara Rohit | త్వరలో తండ్రి కాబోతున్న నారా రోహిత్.. శిరీష్ బేబి బంప్ వీడియో వైరల్
Nara Rohit | టాలీవుడ్ నటుడు నారా రోహిత్ ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన భార్య శిరీష లేళ్ల ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Nara Rohit | టాలీవుడ్ నటుడు నారా రోహిత్ ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన భార్య శిరీష లేళ్ల ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
నారా రోహిత్, శిరీషల పరిచయం ప్రతినిధి 2 సినిమా ద్వారా ఏర్పడింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య స్నేహం పెరిగి, ఆ తరువాత ప్రేమగా మారింది. కుటుంబ సభ్యుల సమ్మతితో ఈ జంట 2025 అక్టోబర్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. వీరి పెళ్లి ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పెళ్లి తర్వాత కూడా కలిసి..
పెళ్లి తర్వాత కూడా ఈ జంట కలిసి సుందరకాండ సినిమాలో నటించడం విశేషం. ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు ఆఫ్‌స్క్రీన్ బాండింగ్‌తో కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా శిరీష ప్రెగ్నెంట్ అన్న వార్తలు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఓ కుటుంబ వేడుకకు హాజరైన సందర్భంగా ఆమె బేబీ బంప్‌తో కనిపించారన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన ఓ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అయితే, ఈ వార్తలపై ఇప్పటివరకు నారా రోహిత్ లేదా శిరీష ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఇది నిజమా? లేక కేవలం రూమరా? అన్నది తెలియాల్సి ఉంది.
ఇక నారా రోహిత్ విషయానికొస్తే, విభిన్న కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకవైపు కెరీర్‌లో దూసుకుపోతూనే, మరోవైపు వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నారని వార్తలు రావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
నారా ఫ్యామిలీకి గుడ్ న్యూస్.. తండ్రి కాబోతున్న నారా రోహిత్ #narachandrababu #nararohith #naralokesh #telugunews #tollywood pic.twitter.com/SmMQzwnt5F
— srk (@srk9484) April 30, 2026
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram