Indian Railways | రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ట్రైన్‌లో నెయ్యిని తీసుకెళ్తున్నారా? ఈ రూల్స్ తెలియకపోతే ఇబ్బందులు తప్పవు!

Indian Railways | రైళ్లలో నూనె, నెయ్యి వంటి పదార్థాలను తీసుకెళ్లడంపై భారతీయ రైల్వే కఠిన నిబంధనలు అమలు చేస్తోందని చాలామంది తెలియదు. సరైన ప్యాకింగ్ లేకుండా నెయ్యి లేదా నూనె తీసుకెళ్తూ పట్టుబడితే జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా పడే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు.

Indian Railways | సొంతూళ్లకు వెళ్లి తిరిగొచ్చేప్పుడు సాధారణంగా స్వీట్లు, పచ్చళ్లు, స్నాక్స్ వంటివి తెచ్చుకుంటుంటారు. గ్రామీణ ప్రాంతాల వారైతే స్వచ్ఛమైన నెయ్యిని కూడా తీసుకొస్తుంటారు. అయితే రైళ్లలో నూనె, నెయ్యి వంటి పదార్థాలను తీసుకెళ్లడంపై భారతీయ రైల్వే కఠిన నిబంధనలు అమలు చేస్తోందని చాలామంది తెలియదు. సరైన ప్యాకింగ్ లేకుండా నెయ్యి లేదా నూనె తీసుకెళ్తూ పట్టుబడితే జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా పడే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు. మరి రైల్వే శాఖ అమలు చేస్తున్న ఈ ప్రత్యేక నిబంధన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. ప్రమాదకరమైన, పేలుడు సంభవించే, త్వరగా మంటలు అంటుకునే ఏ వస్తువునైనా సరే రైలులో తీసుకెళ్లడం నేరం. ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైల్వే శాఖ ఈ నిబంధనను అమలు చేస్తోంది. నెయ్యి, వంట నూనెలు, పెయింట్ వంటి ఆయిల్ ఆధారిత పదార్థాలు ద్రవరూపంలో ఉండి, అధిక ఉష్ణోగ్రత వద్ద మండే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఒకవేళ రైలు ప్రయాణాల సమయంలో అవి లీకైతే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే వాటిపై ఆంక్షలు విధించి, సాధారణ లగేజీగా అనుమతించడం లేదు. కాకపోతే వీటికి కొన్ని పరిమితులు ఉన్నాయి.

నెయ్యి లేదా నూనెను ప్లాస్టిక్ కవర్లలో లేదా లూజ్ మూతతో ఉన్న డబ్బాలో పెట్టి తీసుకెళ్లినప్పుడు.. అది లీక్ అవుతూ రైల్వే సిబ్బందికి కనబడితే కఠిన చర్యలు ఉంటాయి. ఈ నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ. వెయ్యి జరిమానా లేదా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి రెండు శిక్షలు కూడా విధించే అవకాశం ఉంటుంది. అలాగే మీ కారణంగా తోటి ప్రయాణికుల లగేజీ పాడైతే దానికి కూడా మీరే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

అయితే నెయ్యిపై ఆంక్షలు ఉన్నాయి కానీ పూర్తిగా నిషేధం లేదు. ఒక్కో ప్రయాణికుడు రైలులో గరిష్టంగా 20 కిలోల వరకు నెయ్యిని తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. కానీ దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్లాస్టిక్ కవర్లు, లీకయ్యే మూతలు ఉన్న డబ్బాల్లో తీసుకెళ్లడానికి రైల్వే నిబంధనలు అనుమతించవు. సరిగ్గా సీల్ ఉన్న.. లీక్ ప్రూఫ్ కంటైనర్లలో మాత్రమే అనుమతిస్తారు. అలాగే పేలుడు పదార్థాలు, ఖాళీ గ్యాస్ సిలిండర్లు, యాసిడ్, ప్రమాదకరమైన రసాయనాలు, పొడి ఆకులు, చనిపోయిన కోళ్లు వంటి వస్తువులను కూడా రైళ్లలో తీసుకెళ్లడంపై నిషేధం ఉంది.

Read More:

ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్..మూడు సరికొత్త ‘భారత్ గౌరవ్’ ప్యాకేజీలు!

Latest News