Tata Tiago EV | దేశీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో ఇప్పటికే విపరీతమైన ఆదరణ పొందిన టాటా టియోగో ఈవీ ఇప్పుడు మరింత స్టైలిష్‌గా, ఆధునిక ఫీచర్లతో రాబోతోంది. 2026 టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను మే 28వ తేదీన అధికారికంగా విడుదల చేయబోతుంది. ఈ క్రమంలో అధికారిక లాంచ్‌కు ముందే టాటా మోటార్స్ టీజ్ చేసింది. దీన్నిబట్టి ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడల్‌తో పోలిస్తే కొత్త టియాగో ఈవీలో కీలక మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
360 డిగ్రీ కెమెరా
2026 టియాగో ఈవీలో ప్రధానంగా 360 డిగ్రీ కెమెరా వ్యవస్థ ఉండనుంది. ఫ్రంట్‌లో టాటా లోగో కింద కెమెరా అమర్చగా.. ORVMల దిగువ భాగంలో కూడా కెమెరాలను ఏర్పాటుచేశారు. వెనుక భాగంలో నంబర్ ప్లేట్ దగ్గర మరో కెమెరా ఉంచారు. దీంతో కారును పార్క్ చేయడం, ట్రాఫిక్‌లో డ్రైవ్ చేయడం మరింత సులభతరం కానుంది. ఖరీదైన కార్లలో కనిపించే ఈ ఫీచర్ ఇప్పుడు తక్కువ ధరలోనే టాటా మోటార్స్ అందిస్తుండటం విశేషం.
కొత్త కలర్ ఆప్షన్లు
టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్‌కు కొత్త లైట్ గ్రీన్ కలర్‌ను టాటా మోటార్స్ టీజ్ చేసింది. ఇది కారుకు ఫ్రెష్, మోడ్రన్ లుక్‌ను ఇస్తోంది. ఇంకా మరికొన్ని కొత్త కలర్ ఆప్షన్లు కూడా వచ్చే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు చెబుతున్నాయి.
ఫ్రంట్ డిజైన్‌లో మార్పు
ప్రస్తుత టియాగో ఈవీ, పెట్రోల్ టియాగో మోడళ్ల మధ్య పెద్దగా తేడాలు ఉండేవి కావు. కానీ కొత్త 2026 మోడల్‌లో మాత్రం ఈవీకి ప్రత్యేకమైన ఫ్రంట్ డిజైన్‌ను అందించారు. బాడీ కలర్‌లోనే క్లోజ్‌డ్ ఫ్రంట్ ప్యానెల్, కొత్త బంపర్ డిజైన్ ఈ కారును మరింత ఫ్యూచరిస్టిక్‌గా చూపిస్తున్నాయి. టాటా పంచ్ ఈవీని పోలి ఉండేలా Vertical Slotted Air dam కూడా అందించారు.
ఫాగ్ ల్యాంప్స్ తొలగింపు!
2026 టియాగో ఈవీలో పూర్తిగా రీడిజైన్ చేసిన LED హెడ్‌ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ DRLs ఇస్తున్నారు. వెనుకభాగంలో కనెక్టెడ్ LED టెయిల్ ట్యాంప్స్ ఉన్నాయి. అయితే ఈసారి ఫాగ్ ల్యాంప్స్‌ను తొలగించినట్లు తెలుస్తోంది.
ఏరో అలాయ్‌వీల్స్
ఇక కొత్త టియాగో ఈవీ బ్లాక్ ఫినిష్‌లో కొత్త ఏరో అలాయ్ వీల్స్ అందిస్తున్నారు. ఇది కేవలం లుక్‌కే కాకుండా, కారు ఏరోడైనమిక్ పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయని సమాచారం.
ప్రీమియం ఇంటీరియర్!
ఇంటీరియర్ విషయానికి వస్తే.. కొత్త టియాగో ఈవీ క్యాబిన్‌లో కూడా పలు మార్పులు చేశారు. పెద్ద ఫ్రీ స్టాండింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లైట్ కలర్ సీట్లు, మరింత కంఫర్ట్ ఇచ్చే సీటింగ్ డిజైన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Read More:
దూకుడు పెంచిన టాటా మోటార్స్.. సియారా ఈవీ లాంచ్ కన్ఫార్మ్.. మరో రెండు కొత్త మోడళ్లు కూడా!
