Tata Altroz | ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో టాటా ఆల్ట్రోజ్ iCNG.. ధర ఎంతంటే..!
Tata Altroz | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT)తో కూడిన హ్యాచ్‌బ్యాక్ Tata Altroz iCNG వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ప్రారంభ ధరను రూ.8.69 లక్షలు (ఎక్స్ షోరూమ్‌గా)గా ప్రకటించింది.
Tata Altroz | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT)తో కూడిన హ్యాచ్‌బ్యాక్ Tata Altroz iCNG వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ప్రారంభ ధరను రూ.8.69 లక్షలు (ఎక్స్ షోరూమ్‌గా)గా ప్రకటించింది. దీంతో సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌తో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందిస్తున్న దేశంలోని తొలి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా ఆల్ట్రోజ్ నిలిచిందని టాటా మోటార్స్ వెల్లడించింది.
ఇప్పటికే పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ వంటి పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో మార్కెట్‌లో ఉన్న ఆల్ట్రోజ్‌కు ఇప్పుడు AMT ఎంపికను జోడించడం ద్వారా వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పిస్తున్నట్లు టాటా మోటార్స్ కంపెనీ తెలిపింది. నగరాల్లోని ట్రాఫిక్‌లో సులభమైన డ్రైవింగ్ కోసం ఆటోమేటిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త వేరియంట్ తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.
ఐదు వేరియంట్లలో అందుబాటులోకి.!
టాటా ఆల్ట్రోజ్ iCNG AMT మొత్తం ఐదు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. Pure , Pure S, Creative, Creative S, Acomplished S ట్రిమ్‌ల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. వీటి ధరలు రూ.8.69 లక్షలు (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.10.76 లక్షలు (ఎక్స్ షోరూం)గా ఉన్నాయి.

ఇంజిన్ – పర్ఫార్మెన్స్
కొత్త ఆల్ట్రోజ్ iCNG AMTలో 1.2 లీటర్ Revotron iCNG ఇంజిన్2ను అమర్చారు. ఇది సీఎన్‌జీ మోడ్‌లో 73.5bhp పవర్, 103nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటివరకు మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించిన ఈ ఇంజిన్‌కు తొలిసారిగా AMT ట్రాన్స్‌మిషన్‌ను జోడించింది. దీంతో రద్దీగా ఉండే రోడ్లపై కార్లను నడపడం సులభతరం అవుతుంది.
ఈ హ్యాచ్‌బ్యాక్‌లో ప్రత్యేకమైన ECU సిస్టమ్ ఉపయోగించామని టాటా మోటార్స్ తెలిపింది. దీని ద్వారా పెట్రోల్, CNG మోడ్‌ల మధ్య మార్పు సాఫీగా జరుగుతుందని పేర్కొంది. అలాగే ఇందులో డైరెక్ట్ స్టార్ట్ ఇన్ CNG ఫీచర్‌ను కూడా అందించారు. దీనివల్ల వాహనం నేరుగా సీఎన్‌జీ మోడ్‌లోనే స్టార్ట్ అవుతుంది. ముందుగా పెట్రోల్‌పై స్టార్ట్ చేసి తర్వాత సీఎన్‌జీకి మారాల్సిన అవసరం ఉండదు.
ట్విన్ సిలిండర్ టెక్నాలజీ
ఇప్పటికే తన iCNG వాహనాల్లో ఉపయోగిస్తున్న ట్విన్ సిలిండర్ టెక్నాలజీని ఈ మోడల్‌లో కూడా కొనసాగించింది. ఇందులో రెండు చిన్న CNG సిలిండర్లను లగేజ్ ఫ్లోర్ కింద అమర్చారు. దీంతో సీఎన్‌జీ వాహనాల్లో సాధారణంగా ఎదురయ్యే లగేజ్ స్పేస్ సమస్యను కొంతవరకు తగ్గించగలిగారు. దీంతో ఈ వేరియంట్‌లో 210 లీటర్ల వరకు బూట్ స్పేస్ లభిస్తుంది. సాధారణంగా పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో 345 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది.
లేటెస్ట్ ఫీచర్లు
ఈ కారులో ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, ఇన్ఫినిటీ కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్, DRLలతో కూడిన LED హెడ్ ల్యాంప్స్, HARMAN అల్ట్రా వ్యూ 10.25 అంగుళాల ట్విన్ డిజిటల్ స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక ఇంటీరియర్‌లో ఎగ్జిక్యూటివ్ లాంచ్ స్టైల్ రియర్ సీట్లు, సాఫ్ట్ టచ్ డ్యాష్‌బోర్డ్, అంబియెంట్ లైటింగ్, 26.03 సెంటీమీటర్ల డ్యూయల్ డిజిటల్ డిస్‌ప్లే అందించారు.
సేఫ్టీలో నో కంప్రమైజ్!
సేఫ్టీపరంగా కూడా టాటా ఆల్ట్రోజ్ ఏ మాత్రం తగ్గలేదు. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ అన్ని వేరియంట్లకు 5 స్టార్ భారత్ NCAP సేఫ్టీ రేటింగ్ లభించింది. దీనిలో స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, ISOFI చైల్ సీట్ మౌంట్స్, రివర్స్ పార్కింగ్ సెన్సర్లు అందించారు. హైఎండ్ వేరియంట్లలో 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, LED ఫాగ్ ల్యాంప్స్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఈ AMT CNG మోడల్ ఆవిష్కరణలో టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. భారత మార్కెట్‌లో సీఎన్‌జీ వాహనాల వినియోగం గణనీయంగా పెరుగుతోందని తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరంలో సీఎన్‌జీ వాహనాల వాట 19 శాతంగా ఉండగా.. 2026లో 22 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు.
Read More:
Tata Nexon | రూ.10లక్షల్లోనే పనోరమిక్ సన్‌రూఫ్.. టాటా నెక్సన్ కొత్త వేరియంట్ లాంచ్!
Tata Harrier, Safari | టాటా హారియర్, సఫారీ నుంచి డీజిల్ వేరియంట్లు లాంచ్.. ధరలు ఎంతంటే.!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram