Tata Nexon | రూ.10లక్షల్లోనే పనోరమిక్ సన్‌రూఫ్.. టాటా నెక్సన్ కొత్త వేరియంట్ లాంచ్!
Tata Nexon | స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ మరోసారి సంచలనం సృష్టించింది. రూ.10లక్షల్లోపే పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ అందిస్తున్నది. ఈ ఫీచర్‌తో టాటా మోటార్స్ తాజాగా Nexon Pure+PS అనే కొత్త వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
Tata Nexon | స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ మరోసారి సంచలనం సృష్టించింది. రూ.10లక్షల్లోపే పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ అందిస్తున్నది. ఈ ఫీచర్‌తో టాటా మోటార్స్ తాజాగా Nexon Pure+PS అనే కొత్త వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీనీ ప్రారంభ ధర రూ.9.59 లక్షలు (ఎక్స్ షోరూం ధర)గా నిర్ణయించింది.
ఇప్పటివరకు పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ సాధారణంగా ప్రీమియం SUVల్లో మాత్రమే లభించేది. అయితే ఇప్పుడు టాటా మోటార్స్ ఈ ఫోచర్‌ను తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకురావడంతో కొత్తగా కారు కొనాలనుకునేవారిలో ఆసక్తి పెరిగింది. అంతేకాదు ఈ కారులోని సన్‌రూఫ్‌కు వాయిస్ అసిస్టెడ్ ఫీచర్ కూడా ఉండటం విశేషం.
కొత్త నెక్సాన్ ప్యూర్+ పీఎస్ వేరియంట్‌ను పెట్రోల్, డీజిల్, ట్విన్ సిలిండర్ ఐసీఎన్‌జీ ఆప్షన్లలో అందిస్తున్నారు. పెట్రోల్, ఐసీఎన్‌జీ వేరియంట్లలో 1.2 లీటర్ టర్బో చార్జ్‌డ్ ఇంజిన్ ఉంది. ఇది 120bhp పవర్, 170nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ లేదా 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికతో పాటు 6 స్పీడ్ AMT, 7 స్పీడ్ DCTతో వస్తుంది.
ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది వాయిస్ అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్‌తో పాటు 10.25 అంగుళాల Harman ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఆటో LED హెడ్‌ల్యాంప్స్, రైన్ సెన్సింగ్ వైపర్స్, HD రేర్‌వ్యూ కెమెరా, పార్కింగ్ సెన్సర్లు, LED టెయిల్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈ టాటా Nexon Pure+PS వేరియంట్ పెట్రోల్ మ్యాన్సువల్ వెర్షన్ ధర రూ.9.59లక్షలుగా ఉంది. దీని పెట్రోల్ AMT వెర్షన్ ధర రూ.10.14 లక్షలుగా నిర్ణయించారు. ఇక ట్విన్ సిలిండర్ iCNG మ్యాన్యువల్ వేరియంట్ ధర రూ.10.39లక్షలుగా, డీజిల్ మ్యాన్యువల్ ధరను రూ.10.54లక్షలుగా, డీజిల్ AMT వేరియంట్ ధరను రూ.11.19లక్షలుగా ఖరారు చేశారు.
భారత మార్కెట్‌లో కాంపాక్ట్ SUVల్లో టాటా నెక్సాన్ అత్యంత ప్రజాదరణ పొందిన కారుగా ఉంది. గ్లోబల్ NCAP 5 స్టార్ రేటింగ్ పొందిన తొలి భారతీయ కారుగా ఇది గుర్తింపు పొందింది. అలాగే Bharat NCAPలో కూడా ఇది 5 స్టార్ రేటింగ్ సాధించడం గమనార్హం.పెట్రోల్, డీజిల్, CNG, ఎలక్ట్రిక్ వంటి పలు పవర్‌ట్రైన్ ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంది.
Read More:
175 కిలోమీటర్ల రేంజ్‌తో కొత్త టీవీఎస్ ఐ క్యూబ్.. ధర ఎంతంటే..!
టాటా హారియర్, సఫారీ నుంచి డీజిల్ వేరియంట్లు లాంచ్.. ధరలు ఎంతంటే.!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram