TVS iQube S 4.7kWh | 175 కిలోమీటర్ల రేంజ్‌తో కొత్త టీవీఎస్ ఐ క్యూబ్.. ధర ఎంతంటే..!

TVS iQube S 4.7kWh | ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో పెరుగుతున్న పోటీ నేపథ్యంలో ప్రముఖ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ టీవీఎస్ తన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిలో కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. TVS iQube S 4.7kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్‌ను విడుదల చేసింది.

TVS iQube S 4.7kWh | 175 కిలోమీటర్ల రేంజ్‌తో కొత్త టీవీఎస్ ఐ క్యూబ్.. ధర ఎంతంటే..!

TVS iQube S 4.7kWh | ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో పెరుగుతున్న పోటీ నేపథ్యంలో ప్రముఖ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ టీవీఎస్ తన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిలో కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. TVS iQube S 4.7kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఇంతకుముందు ఉన్న 3.5kWh బ్యాటరీ ప్యాక్ స్థానాన్ని భర్తీ చేస్తూ ఈ కొత్త వేరియంట్‌ను తెచ్చింది. దీన్ని రూ.1,37,142 ఎక్స్‌షోరూం ధరకు మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇప్పటికే ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కువ రేంజ్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని టీవీఎస్ కంపెనీ ఈ కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది. గతంలో ఉన్న 3.5kWh బ్యాటరీ స్థానంలో 4.7kWh బ్యాటరీని అమర్చడంతో దీని రేంజ్ భారీగా పెరిగింది. ఈ కొత్త వేరియంట్‌ను ఒక్కసారి పూర్తి చార్జ్ చేస్తే గరిష్ఠంగా 175 కిలోమీటర్ల IDC రేంజ్ ఇస్తుందని టీవీఎస్ కంపెనీ ప్రకటించింది. పాత మోడల్‌తో పోలిస్తే ఇది 30 కిలోమీటర్లు అదనం. కాబట్టి రోజువారీ ప్రయాణాలతోపాటు ఆకస్మిక లాంగ్ రైడ్స్‌కు కూడా ఈ స్కూటర్ అనుకూలంగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

డిజైన్‌పరంగా iQube S 4.7kWh వేరియంట్‌లో మునుపటి మోడల్ డిజైన్‌నే యథాతథంగా కొనసాగించారు. ఇది Serfas True Series Lightingతో అనుసంధానించిన LED హెడ్‌లైట్, ట్రైల్ లైట్‌ను కలిగి ఉంది. వెనుక కూర్చునే వారి కోసం దీనికి ఒక బ్యాక్‌రెస్ట్ కూడా అందించారు. దీనికి 32 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. దీనిలో రెండు హెల్మెట్లు పడతాయి. అలాగే మొబైల్ చార్జ్ చేయడానికి యూఎస్‌బీ చార్జింగ్ పోర్టు కూడా ఉంది.

మోటార్, పనితీరు

ఈ స్కూటర్‌లో BLDC హబ్ మౌంటెడ్ మోటార్‌ను అమర్చారు. ఇది 6bhp శక్తితో పాటు 140nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ కేవలం 4.3 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని టీవీఎస్ కంపెనీ వెల్లడించింది. దీని గరిష్ఠ వేగం గంటకు 82కిలోమీటర్లు అని తెలిపింది.

ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా

ఈ కొత్త వేరియంట్‌లోని 4.7kWh బ్యాటరీ ప్యాక్‌ను 0 నుంచి 80 శాతం వరకు చార్జ్ చేయడానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. బేస్ వేరియంట్లతో పోలిస్తే వేగవంతమైన చార్జింగ్‌ను అందిస్తుంది. అదనంగా రివర్స్ మోడ్ ఫీచర్‌ను కూడా అందించారు.

ఆకట్టుకునే ఫీచర్లు

టీవీఎస్ ఐక్యూబ్ S సిరీస్‌లో 7 అంగుళాల TFT డిస్‌ప్లే ఇచ్చారు. ఇందులో టర్న్ బై టర్న్ నావిగేషన్, ఇన్‌కమింగ్ కాల్ అలర్ట్స్, USB చార్జింగ్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. వినియోగదారుల అభిరుచికి తగ్గట్లుగా కొత్త డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లు కూడా తీసుకొచ్చారు. Magnificence Purple Beige, Harlequin Blue Beige రంగుల్లో ఈ కొత్త వేరియంట్ వచ్చింది. అలాగే ఇప్పటికే ఉన్న Titanium Gray Matte కలర్ కూడా అందుబాటులో ఉంది.

సస్పెన్షన్, బ్రేకింగ్ సిస్టమ్

ఈ స్కూటర్ ట్యూబులర్ ఫ్రేమ్‌పై నిర్మించారు. దీని ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక భాగంలో అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్లను అమర్చారు. బ్రేకింగ్ కోసం ముందు 220mm డిస్క్ బ్రేక్, వెనుక 130mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. ఈ స్కూటర్ బరువు 128.8 కిలోలు కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 157mm, సీట్ హైట్ 770mm గా ఉంది.దీనివల్ల సిటీలోని రోడ్లపై సౌకర్యవంతమైన రైడింగ్ లభిస్తుందని కంపెనీ తెలిపింది.

Read More:

టాటా హారియర్, సఫారీ నుంచి డీజిల్ వేరియంట్లు లాంచ్.. ధరలు ఎంతంటే.!

ఆకట్టుకునే ఫీచర్లతో టాటా కర్వ్ ఈవీలో రెండు కొత్త వేరియంట్లు.. ధర ఎంతంటే..!