Tata Harrier, Safari | టాటా హారియర్, సఫారీ నుంచి డీజిల్ వేరియంట్లు లాంచ్.. ధరలు ఎంతంటే.!
Tata Harrier, Safari | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన హారియర్, సఫారీ SUVలకు సంబంధించి డీజిల్ వేరియంట్లలో Ultra, Ultra Red Dark ఎడిషన్‌లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది.
Tata Harrier, Safari | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన హారియర్, సఫారీ SUVలకు సంబంధించి డీజిల్ వేరియంట్లలో Ultra, Ultra Red Dark ఎడిషన్‌లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో పెట్రోల్ వేరియంట్లలో మాత్రమే ఈ ప్రత్యేక ఎడిషన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు డీజిల్ పవర్‌ట్రెయిన్ కూడా అందుబాటులోకి వచ్చాయి. దేశంలోని అన్ని టాటా డీలర్‌షిప్‌లతో పాటు అధికారిక వెబ్‌సైట్ నుంచి వీటి బుకింగ్స్ అందుబాటులో ఉన్నాయి.
హారియర్, సఫారీలో కొత్త వేరియంట్లు
టాటా మోటార్స్ తెలిపిన వివరాల ప్రకారం హారియర్ డీజిల్ మోడల్ ఇప్పుడు Fearless Ultra, Fearless Ultra Red Dark వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా సఫారీ SUV Accomplished Ultra, Accomplished Ultra Red Dark వేరియంట్లలో వచ్చింది. ఈ వేరియంట్లు అన్నీ ఆరు స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో లభిస్తాయి. వీటిలో 2.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది గరిష్ఠంగా 168bhp పవర్, 350nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
రెడ్ డార్క్ ఎడిషన్ స్పెషాలిటీ
రెడ్ డార్క్ ఎడిషన్‌లో బ్లాక్ కలర్ థీమ్ ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. SUV బాడీపై ఎరుపు అక్షరాలు, హెడ్‌ల్యాంప్‌లో రెడ్ ఇన్‌సర్ట్ష్, గ్రిల్‌పై ప్రత్యేక డిజైన్, రెడ్ బ్రేక్ కాలిపర్స్ వంటివి దీనికి స్పోర్టీలుక్‌ను ఇస్తున్నాయి. ఇంటీరియర్‌లో కార్నెలియన్ రెడ్ థీమ్‌తో అలంకరించిన క్యాబిన్‌ను అందించారు. ఇందులో ఎరుపు రంగు లెదరేట్ సీటు అప్హోల్సరీని వినియోగించారు. ఇది వాహనం లోపలి భాగానికి అత్యంత ప్రీమియం, స్పోర్టీ అనుభూతిని అందిస్తుంది.
వీటిలో శాంసంగ్ నియో QLED డిస్‌ప్లేతో కూడిన 36.9cm హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డాల్బీ అట్మాస్ ఎనేబుల్డ్ ఆడియో సిస్టమ్, మ్యాపుల్స్ ఆటో ద్వారా పనిచేసే ఇంటర్నల్ నావిగేషన్ ఉన్నాయి.
ఫీచర్లపరంగా మరింత అప్‌గ్రేడ్
హారియర్ అల్ట్రా వేరియంట్‌లో ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్ డిజిటల్ స్క్రీన్లు, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, లెవల్ 2 ADAS, Dolby Atmos సౌండ్ సిస్టమ్, డ్యూయల్ డ్యాష్‌క్యామ్, స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్, 65W USB Type C ఫాస్ట్ చార్జింగ్ పోర్టులు వంటి ప్రీమియం ఫీచర్లను అందించారు.
అదే సఫారీలో వీటికి అదనంగా రెండో వరుస ప్రయాణికుల కోసం వెంటిలేటెడ్ సీట్లు కలిగిన ప్రత్యేక రియర్ సీట్ ప్యాకేజీని కూడా అందించారు.
టర్బోచార్జ్ డీజిల్ ఇంజిన్
హారియర్, సఫారీ రెండు SUVల్లోనూ 2.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌ను టాటా మోట్సార్స్ ఉపయోగించింది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 168bhp పవర్, 350 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్సువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉంది. ఈ రెండు కూడా 5 స్టార్ భారత NCAP సేఫ్టీ రేటింగ్‌ను పొందాయి.
ధరలు ఎలా ఉన్నాయంటే..
Harrier Fearless Ultra MT ధర రూ.23.85 లక్షలు కాగా.. Fearless Ultra AT ధర రూ.25.30 లక్షలుగా ఉంది. Fearless Ultra Red Dark MT ధర రూ.24.40 లక్షలు కాగా.. ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.25.85 లక్షలుగా నిర్ణయించారు.
Safari Accomplished Ultra MT 7S ధర రూ.24.50 లక్షలు కాగా, AT 7S ధర రూ.25.95లక్షలుగా ఉంది. ఆరు సీట్ల Accomplished Ultra MT 6S ధర రూ.24.60 లక్షలు కాగా, ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.26.05 లక్షలకు అందుబాటులో ఉంది. ఇక Accomplished Ultra Red Dark MT 7S ధర రూ.24.85లక్షలు కాగా, AT 7S ధర రూ.26.30లక్షలుగా ఉంది. అలాగే 6S Red Dark MT ధర రూ.24.95 లక్షలు, ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.26.40లక్షలుగా కంపెనీ ప్రకటించింది.
Read More:
ఆకట్టుకునే ఫీచర్లతో టాటా కర్వ్ ఈవీలో రెండు కొత్త వేరియంట్లు.. ధర ఎంతంటే..!
రూ.99,999కే ఓబెన్ రోర్ EVO.. 8 ఏళ్ల వారంటీ, 180 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్.. !
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram