Tata Curvv.ev | ఆకట్టుకునే ఫీచర్లతో టాటా కర్వ్ ఈవీలో రెండు కొత్త వేరియంట్లు.. ధర ఎంతంటే..!
Tata Curvv.ev | దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ తన కర్వ్ EV వేరియంట్ల శ్రేణిని పున:వ్యవస్థీకరించింది. ఇప్పటివరకు విక్రయించిన ఇతర వేరియంట్ల స్థానంలో రెండు కొత్త SeriesX ట్రిమ్‌లను ప్రవేశపెట్టింది. ఈ కొత్త సిరీస్‌లో రెండు ప్రధాన వేరియంట్లు Accomplished X 55, Empowered X 55 అందుబాటులోకి వచ్చాయి.
Tata Curvv.ev | దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని మరింత విస్తరించింది. కర్వ్ EV వేరియంట్ల శ్రేణిని పున:వ్యవస్థీకరించింది. ఇప్పటివరకు విక్రయించిన ఇతర వేరియంట్ల స్థానంలో రెండు కొత్త SeriesX ట్రిమ్‌లను ప్రవేశపెట్టింది. ఈ కొత్త సిరీస్‌లో రెండు ప్రధాన వేరియంట్లు Accomplished X 55, Empowered X 55 అందుబాటులోకి వచ్చాయి.
బ్యాటరీ-రేంజ్ విశేషాలు
x సిరీస్‌లోని ఈ రెండు వేరియంట్లు కూడా 55kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్‌తో వస్తాయి. ఇవి 167 హార్స్‌పవర్ శక్తి, 215 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీన్ని ఒక్కసారి పూర్తిగా చార్జి చేస్తే 502 కిలోమీటర్లు (ARAI సర్టిఫైడ్) రేంజ్‌ను అందిస్తుందని టాటా మోటార్స్ ప్రకటించింది. అయితే వాస్తవ వినియోగంలో సుమారు 400కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని అంచనా.
ఈ సిరీస్‌లో ప్రత్యేకంగా హైలైట్ అయ్యే అంశం బ్యాటరీ వారంటీనే. హైవోల్టేజ్ బ్యాటరీపై జీవితకాల వారంటీని కూడా అందిస్తుంది. ఇది రిజిస్ట్రేషన్ తేదీ నుంచి 15 సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది.
డిజైన్-పనితీరు
ఈ ఎలక్ట్రిక్ కూపే SUV స్టైల్ డిజైన్‌తో కూడిన కర్వ్ ev నగర ప్రయాణాలకే కాకుండా హైవే డ్రైవింగ్‌కు కూడా అనువైన పనితీరు అందించేలా రూపొందించారు. స్మూత్ డ్రైవింగ్ అనుభవంతో పాటు మంచి యాక్సిలరేషన్‌ను కూడా ఇది అందిస్తుంది.
Accomplished X 55 వేరియంట్‌లో ప్రీమియం ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వేరియంట్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ డిజిటల్ స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అలాగే వెంటిలేటెడ్ సీట్లు, లెదరెట్ అప్‌హోల్ట్సరీ, రియర్ సన్‌షేడ్స్ కూడా ఉన్నాయి.
Empowered X 55 వేరియంట్‌లో మరింత ప్రీమియం ఫీచర్లు పొందుపరిచారు. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, JBL 9 స్పీకర్ సౌండ్ సిస్టమ్, పవర్డ్ డ్రైవింగ్ సీట్, రీక్లైనింగ్ రియర్ సీట్లు ఇందులో ఉన్నాయి. అదనంగా లెవల్ 2 ADAS భద్రతా ఫీచర్లు అందించారు.
అదనంగా రూ.30వేలు చెల్లించడం ద్వారా ఎంపవర్డ్ X55 వేరియంట్‌ను నలుపు రంగులో తీర్చిదిద్దిన బాహ్య, అంతర్గత భాగాలతో కూడిన డార్క్ ఎడిషన్ రూపంలో కూడా పొందవచ్చు. ఇది కాకుండా టాటా మోటార్స్ ప్రస్తుత కలర్ ప్యాలెట్2తో పాటు నైట్రో క్రిమ్సన్ అనే కొత్త ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్‌ను కూడా పరిచయం చేసింది.
ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇక ధరల విషయానికి వస్తే Accomplished X 55 ధరను రూ.16.99లక్షలు (ఎక్స్ షోరూం), Empowered X 55 వేరియంట్ ధరను రూ.19.19 లక్షలు(ఎక్స్ షోరూం), టాప్ ఎండ్ డార్క్ ఎడిషన్ ధరను రూ.19.49 లక్షలు (ఎక్స్ షోరూం)గా నిర్ణయించింది.
Read More:
రూ.99,999కే ఓబెన్ రోర్ EVO.. 8 ఏళ్ల వారంటీ, 180 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్.. !
స్పోర్టీ లుక్‌తో సరికొత్త మినీ కూపర్.. ధర ఎంతంటే..!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram