Mini Cooper | స్పోర్టీ లుక్‌తో సరికొత్త మినీ కూపర్.. ధర ఎంతంటే..!

Mini Cooper | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మినీ ఇండియా సరికొత్త ప్రీమియం కన్వర్టిబుల్ కారును విడుదల చేసింది. Mini Cooper S Convertible JCW Pack పేరుతో కారును ఆవిష్కరించింది. దీని ధరను రూ.61.50 లక్షలు (ఎక్స్ షోరూం)గా నిర్ణయించింది.

Reported by: Chandram | Latest News | Apr 29, 2026, 11:06 pm IST
Read Time: 6 mins
Mini Cooper | స్పోర్టీ లుక్‌తో సరికొత్త మినీ కూపర్.. ధర ఎంతంటే..!

Mini Cooper | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మినీ ఇండియా సరికొత్త ప్రీమియం కన్వర్టిబుల్ కారును విడుదల చేసింది. Mini Cooper S Convertible JCW Pack పేరుతో కారును ఆవిష్కరించింది. దీని ధరను రూ.61.50 లక్షలు (ఎక్స్ షోరూం)గా నిర్ణయించింది. ఇది పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సీబీయూ (Completely Built Unit) రూపంలో భారత్‌లో విడుదలైంది.

ఈ కొత్త వెర్షన్ సాధారణ Cooper S Convertible కంటే కూడా రూ.2.50 లక్షల ఎక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. ప్రత్యేకంగా స్పోర్టీ డిజైన్, ప్రీమియం లుక్ కోరుకునే కస్టమర్ల కోసం ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను తీసుకొచ్చినట్లుగా కంపెనీ వెల్లడించింది.

ఈ జేసీడబ్ల్యూ (John Cooper Works) ప్యాక్‌లో ప్రధానంగా డిజైన్, ఇంటీరియర్, విజువల్ అప్‌గ్రేడ్స్‌పై దృష్టి పెట్టారు. దీని ఐకానిక్ సాఫ్ట్ టాప్ రూఫ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ రూఫ్‌ను కేవలం 18 సెకన్లలో ఎలక్ట్రిక్‌గా ఓపెన్ చేయవచ్చు. గంటకు 30కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఇది పనిచేస్తుంది. అసరమైతే దీనిని పూర్తిగా తెరవకుండా సన్‌రూఫ్‌లా కూడా యూజ్ చేసుకోవచ్చు.

ఎక్స్‌టీరియర్ విషయానికి వస్తే.. ఇది మిడ్‌నైట్ బ్లాక్, లెజెండ్ గ్రే అనే రెండు ప్రత్యేకమైన రంగుల్లో అందుబాటులోకి వస్తుంది. లెజెండ్ గ్రే వేరియంట్‌లో అదనంగా బోనెట్ స్ట్రైప్ష్ కూడా ఇచ్చారు. JCW ప్యాక్‌లో సాధారణంగా ఉండే విధంగానే, ఈ ప్యాకేజీలో కూడా ఫ్రంట్ గ్రిల్, ఎక్స్‌టీరియర్ రియర్‌వ్యూ మిర్రర్ (ORVMs), డోర్ హ్యాండిల్స్, వీల్ ఆర్చ్‌లు, సైడ్ స్కర్ట్‌లు, బంపర్లపై గ్లాస్ బ్లాక్ ఫినిష్ ఉండటం వల్ల ఇది మరింత స్పోర్టీ లుక్‌లో కనిపిస్తుంది. ఈ కారు కొత్త 17 అంగుళాల జేసీడబ్ల్యూ బ్లాక్ అల్లాయ్ వీల్స్, జేసీడబ్ల్యూ బ్రాండెడ్ స్పోర్ట్స్ బ్రేక్‌లు, జెట్ బ్లాక్ ఫ్యాబ్రిక్ రూఫ్‌తో వస్తుంది.

ఇంటీరియర్ విషయానికి వస్తే.. క్యాబిన్ లోపల స్పోర్ట్స్ థీమ్ స్పష్టంగా కనిపిస్తుంది. బ్లాక్ అవుట్ ట్రీట్‌మెంట్ సీట్ల అప్హోల్సరీ, డ్యాష్‌బోర్డ్ ట్రిమ్ వరకు విస్తరించి ఉంది. ఇందులో జేసీడబ్ల్యూ బ్రాండెడ్ స్పెషల్ స్పోర్ట్స్ సీట్లు, జేసీడబ్లయూ ప్రత్యేక స్టీరింగ్ వీల్స్ ఉన్నాయి. డ్రైవింగ్ అనుభవాన్ని మరింత ఉత్సాహంగా మార్చేందుకు ప్యాడిల్ షిఫ్టర్లను కూడా అందించారు.

డ్యాష్‌బోర్డులో 9.4 అంగుళాల సర్క్యులర్ OLED టచ్ స్క్రీన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇది మినీ ఆపరేటింగ్ సిస్టమ్ 9పై పనిచేస్తుంది. ఇన్‌ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కనెక్టెడ్ కారు ఫీఛర్లు అన్ని ఈ స్క్రీన్ ద్వారానే నియంత్రించవచ్చు.

ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 2.0 లీటర్ టర్బో చార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 204hp, 300nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మినీ బ్రాండ్‌కు ప్రత్యేకమైన గో కార్ట్ తరహా డ్రైవింగ్ అనుభవాన్ని ఈ మోడల్ కూడా కొనసాగిస్తుందని కంపెనీ చెబుతోంది.

Mini Cooper S Convertible JCW ప్యాక్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 14వ తేదీ నుంచే బుకింగ్స్ మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా అధికారిక డీలర్‌షిప్ ద్వారా డెలివరీలు కూడా ప్రారంభమైనట్లు మినీ ఇండియా ప్రకటించింది.

Read More:

రూ.59,999కే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. జెలియో నుంచి 2026 గ్రేసీ లాంచ్!

కొత్త బెంజ్ ఈవీ కారు లాంచ్.. సింగిల్ చార్జింగ్‌తో హైదరాబాద్ నుంచి ముంబై వరకు వెళ్లొచ్చు!