Health tips | మీరు సంతాన లేమితో బాధపడుతున్నారా.. అయితే తరచూ ఈ సీడ్స్‌ తినండి..!

Health tips : ఈ రోజుల్లో చాలామంది దంపతులు సంతాన లేమితో బాధపడుతున్నారు. కెరీర్, గోల్స్ అంటూ ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా ఉన్నది. సాధారణంగా యుక్త వయస్సు దాటిపోతుంటే స్త్రీ, పురుషుల్లో సంతానోత్పత్తి (Fertility) సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ కారణంగా ఎంతోమంది దంపతులకు పిల్లలు కలుగడంలేదు. సంతానలేమితో బాధపడుతున్న దంపతులు పిల్లల కోసం కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. డైట్‌లో పోషకాహారాన్ని చేర్చుకోవాలి.

  • Publish Date - July 3, 2024 / 08:09 PM IST

ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలు సంతానలేమిని దూరం చేయడంలో సాయపడతాయి. పొద్దు తిరుగుడు విత్తనాలు (Sunflower Seeds) కూడా ఆ కోవకే చెందుతాయి. ఈ గింజలు పిల్లలను కోరుకునే దంపతులకు ఒక వరమని చెప్పవచ్చు. నిత్యం ఈ గింజలను తగుమోతాదులో తీసుకుంటే అదిరిపోయే లాభాలు పొందుతారు.

మగవాళ్లు రోజుకు ఒకటి నుంచి రెండు స్పూన్‌లు చొప్పున సన్ ఫ్లవర్ సీడ్స్‌ను తీసుకుంటే చాలా మంచిది. విటమిన్ బి, విటమిన్ ఇ, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, సెలీనియం, జింక్‌, కాపర్ లాంటి పోషకాలకు నెలవైన సన్ ఫ్లవర్ సీడ్స్ పురుషుల్లో ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. పునరుత్పత్తి పనితీరుకు మద్దతిస్తాయి.

ఈ గింజల్లో మెండుగా ఉండే జింక్ టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. సెలీనియం కంటెంట్ స్పెర్మ్ కణాలను (Sperm Cells) ఆక్సీకరణ నష్టం నుంచి రక్షించడంలో సాయపడుతుంది. ఇక ఆడవాళ్లలో హార్మోన్ల సమతుల్యతకు అవసరమైన కొవ్వు ఆమ్లాలను సన్ ఫ్లవర్ సీడ్స్ అందిస్తాయి.

పొద్దుతిరుగుడు గింజల్లో ఉండే ఫోలేట్ పునరుత్పత్తి శక్తికి ప్రయోజనకరంగా ఉంటుంది. కాల్షియం, మెగ్నీషియం లాంటి పోషకాలు ఎముక సాంద్రతను పెంచుతాయి. విటమిన్ ఈ చర్మం ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

Latest News