Site icon vidhaatha

నిద్ర‌లేమితో బాధ‌ ప‌డుతున్నారా..? ఈ చిట్కాల‌ను ట్రై చేయండి..!

Health Tips | మారుతూ వ‌స్తున్న జీవ‌న‌శైలి కార‌ణంగా ప్ర‌స్తుతం చాలా మంది నిద్ర‌లేమితో ఇబ్బందులుప‌డుతున్నారు. నిద్ర‌లేమి దీర్ఘ‌కాలంగా ఉంటే హైపర్‌టెన్షన్‌, డయాబెటిస్‌, అధిక బరువు, మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

అయితే, నిద్ర‌లేమికి కార‌ణాలు అనేకం ఉన్నాయి. ఇందులో శారీరక, మానసిక వ్యాధులు, ఒత్తిడి, వాతావరణంలో మార్పులు ప్ర‌ధాన కార‌ణాల‌ని వైద్యులు పేర్కొంటున్నారు. అలాగే శ‌రీరానికి స‌రైన పోష‌కాలు అంద‌క‌పోవ‌డం కూడా నిద్ర‌లేమికి కార‌ణ‌మ‌ని చెబుతున్నారు.

ఆహారపు అలవాట్లలో వ‌స్తున్న మార్పులు, మితిమీరిన భోజ‌నం, చాయ్‌, కాఫీలు ఎక్కువ‌వ‌డం, దీంతో పాటు మధ్యాహ్నం అతి నిద్ర సైతం రాత్రిళ్లు నిద్ర‌లేమికి ఓ కార‌ణం. శరరీంలో నీటి శాతం తగ్గినా స‌మ‌స్య వెంటాడుతుంటుంది. నిద్ర‌లేమిని అధిగ‌మించేందుకు చాలా మంది ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

ఇలా బ‌య‌ట‌ప‌డొచ్చు..

నిద్రలేమితో బాధ‌ప‌డేవారు మ‌ధ్యాహ్నం నిద్ర‌కు దూరంగా ఉండాలి. గర్భిణీలు, వృద్ధులు మాత్రం కొద్దిసేపు నిద్ర‌పోవ‌చ్చు. అలాగే వ్యాయామం చేసే అల‌వాటున్న వ్య‌క్తులు.. వ్యాయామం చేసిన త‌ర్వాత ఓ గంట సేప‌టికి నిద్ర‌పోతే మంచిది. అలాగే పాలు, పెరుగు, చెరుకు రసం, అరటి పండ్లు, యాపిల్‌ పండ్లు, నారింజ, దానిమ్మ పండ్లు తీసుకోవాలి. శరీరాన్ని నూనెతో మ‌సాజ్ చేసుకొని గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయాలి.

నూనెతో తలకు బాగా మర్దనా చేసుకుంటే మంచి నిద్ర‌ప‌డుతుంది. లావెండ‌ర్ నూనెతో అరికాళ్ల‌ను మ‌ర్ద‌నా చేసుకుంటే మంచి ఉప‌యోగంగా ఉంటుంది. గోరు వెచ్చని పాలలో అర టీస్పూన్‌ అశ్వగంధ చూర్ణం కలిపి నిత్యం రాత్రి ప‌డుకునే స‌మ‌యానికి రెండు గంట‌ల ముందు తాగాలి. ఇలా చేస్తూ వ‌స్తుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

రాత్రి భోజనం చేసిన అనంత‌రం పాలలో చిటికెడు జాజికాయ చూర్ణం, బాదంపప్పు, దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి వేసి బాగా కలిపి తాగినా మంచి ఉప‌యోగ‌ముంటుంది. రాత్రిపూట జాజిపూలను దిండు కింద పెట్టుకోవాలి. జాజిపూల తైలం, బాదం నూనెతో తలకు మర్దనా చేసుకుంటుంటే నిద్ర‌లేమి నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు.

Exit mobile version