Site icon vidhaatha

Night Bath | రాత్రి వేళ స్నానం చేసిన వెంట‌నే ఆ ప‌ని చేస్తున్నారా..? ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో తెలుసా..?

Night Bath | పొద్దంతా బిజీ లైఫ్( Busy Life ) గ‌డిపి.. మాన‌సికంగా ఒత్తిడికి గురై.. అల‌స‌ట‌తో ఇంటికి వ‌చ్చేవారు చాలా మందే ఉంటారు. అలాంటి వారంతా.. ఇంట్లో అడుగు పెట్ట‌గానే నేరుగా బాత్రూం( Bathroom )లోకి వెళ్తుంటారు. ఇక స్నానం( Bath ) చేసి రిలాక్స్ అవుతుంటారు. కానీ స్నానం చేశాక చాలా మంది త‌ప్పులు చేస్తుంటారు. ఈ త‌ప్పులు ఎంతో ప్ర‌మాదక‌రం. నిద్ర‌( Sleep )కు ఉప‌క్ర‌మించే ముందు స్నానం చేస్తే మెద‌డు( Brain )పై దుష్ప్ర‌భావం ప‌డుతుంద‌ని, డిప్రెష‌న్‌కు కూడా కార‌ణం అవుతుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చాలా మంది స్నానం చేసిన వెంట‌నే గ‌బ‌గ‌బ కొంత తినేసి బెడ్‌( Bed )పై వాలిపోతుంటారు. ఇలా చేయ‌డం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాద‌ని ఆరోగ్య నిపుణులు( Health Experts ) హెచ్చ‌రిస్తున్నారు. ఇలా చేయ‌డం కార‌ణంగా మెదడు( Brain )పై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. మెదడుకు సంబంధించిన అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వాస్తవానికి రాత్రి వేళ్లలో మన శరీర ఉష్ణోగ్రతలు( Body Temperatures ) తక్కువగా ఉంటాయి. దీన్ని మెదడు గ్రహించి బాడీకి రెస్ట్ కావాలనే సంకేతాలు ఇస్తుంది. నిద్ర పోవాలనే సూచన చేస్తుంది. ఇలా నిద్రపోవాలని మెదడు సిగ్నల్ ఇస్తున్న టైంలో మీరు స్నానం చేస్తే మాత్రం బాడీలోని టెంపరేచర్ ఒక్కసారిగా పెరుగుతుంది. దీంతో మెదడు కన్ఫ్యూజ్ అవుతుంది. దీని వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. ఒక వేళ నిజంగానే మీకు నిద్ర పట్టినా మెదడుకు మాత్రం రెస్ట్ దొరకద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబ‌ట్టి స్నానం చేసిన వెంట‌నే నిద్ర పోవ‌డం వ‌ల్ల క‌లిగే న‌ష్టాలు ఏంటో తెలుసుకుందాం.

స్నానం చేసిన వెంట‌నే నిద్రించ‌డం వ‌ల్ల క‌లిగే న‌ష్టాలు ఇవే..

బరువు పెర‌గ‌డం..

చాలా మంది రాత్రి వేళ భోజ‌నం చేశాక స్నానం చేస్తారు. ఇలా చేయ‌డం వ‌ల్ల బ‌రుగు పెరుగుతార‌ట‌. శ‌రీర సామ‌ర్థ్యాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో అనేక ర‌కాల దీర్ఘ‌కాలిక వ్యాధులు సంభ‌వించే అవ‌కాశం ఉంటుంది. పెరుగుతున్న ఊబకాయంతో మధుమేహం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

జుట్టు సంబంధిత సమస్యలు

స్నానం చేసిన తర్వాత తడి వెంట్రుకలతో నిద్రించడం వల్ల దిండు లేదా మంచం మీద బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని వల్ల స్కాల్ప్ దెబ్బతింటుంది, జుట్టు చిట్లడం సమస్య పెరుగుతుంది. జుట్టులో చుండ్రు వస్తుంది.

కళ్లలో దురద సమస్య

వేడి నీళ్లతో నిరంతరం స్నానం చేయడం వల్ల కళ్లలో తేమ తగ్గుతుంది. దీని వల్ల కళ్లు ఎర్రగా మారుతాయి. దురద సమస్య మొదలవుతుంది. దీని కారణంగా అనేక ఇతర కంటి సంబంధిత సమస్యలు కూడా రావచ్చును.

Exit mobile version