Oxygen facial | ఆక్సిజన్‌ ఫేషియల్‌తో లాభాలెన్నో..

మెరిసే చర్మం కావాలా? అయితే.. ఆక్సిజన్ ఫేషియల్‌ (Oxygen facial) చేయించుకోండి. మీ ముఖం కాంతివంతంగా మారడమే కాకుండా.. మరింత ఆరోగ్యంగా కనిపిస్తుందని అంటున్నారు నిపుణులు. చర్మం కణాల్లోకి వెళ్లే ఆక్సిజన్‌.. చర్మాన్ని పునర్జీవింప చేస్తుంది. దాంతో మరింత కాంతివంతంగా, యవ్వనంగా కనిపిస్తారని చెబుతున్నారు. విధాత : మానసిక ఒత్తిడి, కాలుష్యం.. రోజువారీ జీవితంలో మన చర్మంపై దుష్ప్రభావం చూపుతుంటాయి. ఫలితంగా చర్మం కాంతిని కోల్పోతుంది. దీన్ని తిరిగి పొందేందుకు అనేక రకాల ఫేషియల్స్‌ మహిళలకే కాకుండా, […]

  • Publish Date - April 8, 2023 / 05:45 AM IST

మెరిసే చర్మం కావాలా? అయితే.. ఆక్సిజన్ ఫేషియల్‌ (Oxygen facial) చేయించుకోండి. మీ ముఖం కాంతివంతంగా మారడమే కాకుండా.. మరింత ఆరోగ్యంగా కనిపిస్తుందని అంటున్నారు నిపుణులు. చర్మం కణాల్లోకి వెళ్లే ఆక్సిజన్‌.. చర్మాన్ని పునర్జీవింప చేస్తుంది. దాంతో మరింత కాంతివంతంగా, యవ్వనంగా కనిపిస్తారని చెబుతున్నారు.

విధాత : మానసిక ఒత్తిడి, కాలుష్యం.. రోజువారీ జీవితంలో మన చర్మంపై దుష్ప్రభావం చూపుతుంటాయి. ఫలితంగా చర్మం కాంతిని కోల్పోతుంది. దీన్ని తిరిగి పొందేందుకు అనేక రకాల ఫేషియల్స్‌ మహిళలకే కాకుండా, పురుషులకు కూడా అందుబాటులో ఉన్నాయి.

అయితే.. వాటన్నింటి బదులు ఆక్సిజన్‌ ఫేషియల్‌ను ట్రై చేయండి అంటున్నారు కాస్మొటిక్‌ నిపుణులు. ఇటీవలి కాలంలో ఆక్సిజన్‌ షేషియల్‌ చేయించుకునే వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. ఇతర ఫేషియల్స్‌ కంటే సులభంగా ఇది మీకు యవ్వనంతో కూడిన లుక్‌ను ఇస్తుందని చెబుతున్నారు.

ఏమిటీ ఆక్సిజన్‌ ఫేషియల్‌..

ఆక్సిజన్‌ ఫేషియల్‌ అనేది చర్మంలోని మృత కణాలను ఎలాంటి చికిత్సలు లేకుండా తొలగించే ప్రక్రియ. ఇందులో స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను చర్మంపై ఉపయోగిస్తారు. ముందుగా ఫేస్‌ను డీప్‌ క్లీన్‌ చేసి, చర్మంపై ఉన్న ధూళి కణాలు, జిడ్డు, మేకప్‌ వేసుకున్నప్పుడు మిగిలిన పార్టికల్స్‌ వంటివి తొలగిస్తారు.

అనంతరం హయలురానిక్‌ యాసిడ్‌, విటమిన్లు, యాంటాక్సిడెంట్లు కలిగిన ఒక రసాన్ని ముఖానికి అప్లై చేస్తారు. అది చర్మంలోకి చొచ్చుకుపోయేలా ఒత్తిడితో కూడిన ఆక్సిజన్‌ ఆవిరిని పట్టిస్తారు. అప్లై చేసిన రసం ముఖానికి బాగా పట్టేలా ఇది సహకరిస్తుంది. చర్మానికి అవసరమైన పోషకాలను అందించడం ద్వారా ఆరోగ్యకరంగా, కాంతివంతంగా ఉండేలా చూస్తుందని చెబుతున్నారు.

చర్మానికి దృఢత్వం

ఆక్సిజన్‌ ఫేషియల్‌ వలన చర్మ కణాల్లో రక్తం, ఆక్సిజన్‌ బాగా సర్క్యులేట్‌ అవుతాయి. దాని ఫలితంగా కొలాజెన్‌, ఎలాస్టిన్‌ ఉత్పత్తి ప్రేరేపితమవుతుంది. దీని వల్ల చర్మం దృఢత్వాన్ని సంతరించుకుంటుంది. యవ్వనంగా కనిపిస్తుందని కాస్మొటిక్‌ నిపుణులు చెబుతున్నారు.

మొటిమలకు కూడా దివ్యౌషధం

మొటిమలు, ఇతర చర్మ సమస్యలు ఎదుర్కొనేవారికి ఆక్సిజన్‌ ఫేషియల్‌ అద్భుతంగా పనిచేస్తుందట! మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నిర్మూలించి, చీము పట్టకుండా నివారిస్తుందట. అంతేకాకుండా.. చర్మాన్ని సున్నితంగా మార్చుతుందట.

ఛాయ కూడా మార్చగలదు

ఆక్సిజన్‌ ఫేషియల్‌తో చర్మం ఛాయ కూడా మారుతుందంటున్నారు. అంతేకాకుండా ముఖంపై ముడతలను, పొడిబారిపోవడాన్ని నివారిస్తుందని చెబుతున్నారు

Latest News