Monsoon Ayurvedic Home Remedies | వాతావరణం మారినప్పుడల్లా జలుబు, గొంతులో ఇన్ ఫెక్షన్ చాలా ఇబ్బంది పెడతాయి. గొంతులో మంట, సరిగా మాట్లాడలేకపోవడం, అలాగే అశ్రద్ధ చేస్తే దగ్గు వంటి లక్షణాలు బాధిస్తాయి. అయితే, ఇలాంటప్పుడు వేడి వేడిగా ఏది తాగినా హాయిగా అనిపిస్తుంది. నీళ్లు కూడా నార్మల్ టెంపరేచర్ లోవి కాకుండా వేడి చేసుకుని వెచ్చని నీళ్లు తాగితే ఉపశమనంగా ఉంటుంది. ఇకపోతే గొంతులో నొప్పి, ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా ఉంటే వేడి వేడిగా చికెన్ సూప్ తాగాలి. గొంతునొప్పికి చికెన్ సూప్ ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాదు, జలుబు ఉన్నా పోతుంది.
అల్లంతో…
అల్లం టీ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. జలుబు ఉన్నప్పుడు అల్లం టీ ఔషధంలా అనిపిస్తుంది. గొంతులో చాలా రిలాక్స్ అవుతుంది. నొప్పి తగ్గిన ఫీలింగ్ ఉంటుంది. అల్లం మాత్రమే కాకుండా లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క లాంటివి కూడా వేసి టీ చేసుకుంటే గొంతునొప్పి పరారవుతుంది. జలుబు నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
ఆయుర్వేదంలో అల్లం ప్రత్యేకమైనది. అందుకే టీలో అల్లం ముక్కలు వేసుకోవడమే కాదు.. డైరెక్ట్ గా అల్లం రసం తాగినా మంచిదే. అల్లం ముక్కలతో కూడిన నీళ్లను బాగా మరిగించి, చల్లారిస్తే అల్లం రసం తయారవుతుంది. దీన్ని వడకట్టి, వేడి వేడిగా తాగితే రుచికి మాత్రమే కాదు.. నొప్ప తగ్గడానికి కూడా క్షణాలు చాలు.
ఇమ్యూనిటీ పెంచే నిమ్మ
గొంతు నొప్పి తగ్గడానికి తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో నాచురల్ యాంటీ బయాటిక్స్ ఉంటాయి. అంతేకాదు, ఇవి యాంటి వైరల్ లక్షణాలను కలిగివుంటాయి. కాబట్టి గొంతు నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. జలుబు, గొంతులో ఇన్ ఫెక్షన్ తగ్గిపోతాయి.
మిరియాలతో హాయి
ఇక మనందరికీ తెలిసిన మిరియాల చారుతో అన్నం తింటే గొంతుకు కలిగే హాయే వేరు. మిరియాలు వేసి, మరిగించిన మిరియాల పాలు కూడా ఈ సమస్యలను మాయం చేస్తాయి. ఈ చిట్కాలన్నీ కూడా ఇన్ ఫెక్షన్ తొలి దశలోనే పనిచేస్తాయి. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం యాంటీబయాటిక్స్ అవసరం అవుతాయి. కాబట్టి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లాలి.
ఇవి కూడా చదవండి..
pregnancy myths vs medical advice | కొత్తగా ప్రెగ్నెంట్ అయ్యారా..?
Diabetes Prevention | కొవ్వులతో డయాబెటిస్‌కి చెక్?