Cancer symptoms | మీలో ఈ లక్షణాలు ఉన్నాయా.. అయితే వెంటనే క్యాన్సర్‌ పరీక్షలు చేయించుకోండి..!

Cancer symptoms : క్యాన్సర్ అనే పదం వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఇది ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని చాలామంది భయపడుతారు. కానీ గత 50 ఏళ్లుగా ఈ వ్యాధి బారిన పడినవారు కోలుకునే శాతం మూడింతలు పెరిగింది. మొదట్లో వ్యాధిని గుర్తించడమే ఇందుకు ప్రధాన కారణం. వాస్తవానికి చాలా రకాల క్యాన్సర్లను తీవ్రంగా ముదరకముందే గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా రోగులు ప్రాణాపాయం నుంచి బయటపడే ఛాన్స్ ఉంది.

  • Publish Date - June 15, 2024 / 10:00 PM IST

Cancer symptoms : క్యాన్సర్ అనే పదం వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఇది ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని చాలామంది భయపడుతారు. కానీ గత 50 ఏళ్లుగా ఈ వ్యాధి బారిన పడినవారు కోలుకునే శాతం మూడింతలు పెరిగింది. మొదట్లో వ్యాధిని గుర్తించడమే ఇందుకు ప్రధాన కారణం. వాస్తవానికి చాలా రకాల క్యాన్సర్లను తీవ్రంగా ముదరకముందే గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా రోగులు ప్రాణాపాయం నుంచి బయటపడే ఛాన్స్ ఉంది.

కానీ ఎక్కువ మంది ఈ వ్యాధి లక్షణాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. తీరా వ్యాధి ముదిరిన తర్వాత వైద్యులను సంప్రదిస్తుంటారు. అప్పుడు చికిత్స చేసినా ప్రయోజనం ఉండటం లేదు. కాబట్టి క్యాన్సర్‌ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించగలిగితే ప్రాణాలు దక్కించుకోవచ్చు. క్యాన్సర్‌ ప్రారంభ దశలో మన శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయనేది తెలుసుకుంటే.. ఆ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించి ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

క్యాన్సర్‌ ప్రారంభ లక్షణాలు..

  • బరువు తగ్గడం క్యాన్సర్ మొదటి లక్షణం. కానీ దురదృష్టవశాత్తు చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తారు. మీరు ఎలాంటి కారణం లేకుండా అకస్మాత్తుగా బరువు తగ్గినప్పుడు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
  • ఎవరో కళ్లను పొడుస్తున్నట్లుగా తీవ్రమైన నొప్పి కలుగుతుంది. కళ్లలో క్యాన్సర్ కణాల పెరుగుదలకు ఇది ప్రారంభ సంకేతం. చాలామంది ఈ లక్షణాలను పట్టించుకోరు. కానీ వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
  • క్యాన్సర్‌కు సంబంధించిన మరో లక్షణం అలసట. ఇది క్యాన్సర్‌తో బాధపడుతున్న చాలామందికి కనిపించే ప్రాథమిక లక్షణం. క్యాన్సర్ మనిషిని చాలా బలహీనంగా మారుస్తుంది. అలసట రోజురోజుకు పెరిగిపోతుంది. కొన్నాళ్లకు మంచంపై నుంచి లేవడానికి చాలా కష్టం అనిపిస్తుంది. ఒళ్లంతా నొప్పి, వికారం, వాంతులు అవుతాయి.
  • తరచూ తలనొప్పి రావడం కూడా క్యాన్సర్‌ లక్షణాల్లో ఒకటి. ఈ నొప్పి మొదట్లో స్వల్పంగా ఉండి క్రమంగా పెరుగుతుంది. కాబట్టి అసాధారణమైన తలనొప్పిని అనుభవిస్తున్న వాళ్లు వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే ఇది బ్రెయిన్ ట్యూమర్ ప్రారంభ లక్షణం.
  • మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు మహిళలు క్రమం తప్పకుండా తమ రొమ్ములను స్వయంగా పరీక్షించుకోవాలి. రొమ్ములో ఏవైనా మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లాలి. రొమ్ముల ఆకృతిలో మార్పు, లోపలికి వెళ్లిపోవడం లేదా పక్కకు తిరగడం లాంటివి రొమ్ము క్యాన్సర్ లక్షణాలు.
  • ఋతుస్రావం అసాధారణంగా ఉంటే, అధిక రక్తస్రావంతో భరించలేని నొప్పి వస్తుంటే వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఎందుకంటే అది ఎండోమెట్రియల్ క్యాన్సర్ లక్షణం.
  • ఇవే కాకుండా జననేంద్రియ ప్రాంతాల్లో వాపు, ఆహారం మింగడంలో ఇబ్బంది, జీర్ణ సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు ఉబ్బరం, ప్రేగు కదలికలలో మార్పులు, మూత్ర విసర్జన సమయంలో నొప్పి, జ్వరం, గోళ్ళలో మార్పులు కూడా క్యాన్సర్ లక్షణాలు. వీటిలో ఏది కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Latest News