Health Tips | మీకు థైరాయిడ్‌ సమస్య ఉందా.. ఈ ఫుడ్స్‌తో చెక్‌ పెట్టండి..!

Health Tips : ఈ రోజుల్లో బీపీ, షుగర్‌ లాగానే థైరాయిడ్ కూడా సాధారణ సమస్యలా మారిపోయింది. చాలా మంది థైరాయిడ్‌ బారినపడుతున్నారు. థైరాయిడ్‌ వచ్చినప్పుడు గొంతు దగ్గర వాపు కనిపిస్తుంది. ఈ థైరాయిడ్‌వల్ల అనేక ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. థైరాయిడ్‌ గ్రంథి గొంతులో సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఇది థైరాక్సిన్, ట్రై అయోడో థైరోనిన్ అనే రెండు రకాల హార్మోన్లను స్రవిస్తుంది.

  • Publish Date - June 15, 2024 / 09:30 PM IST

Health Tips : ఈ రోజుల్లో బీపీ, షుగర్‌ లాగానే థైరాయిడ్ కూడా సాధారణ సమస్యలా మారిపోయింది. చాలా మంది థైరాయిడ్‌ బారినపడుతున్నారు. థైరాయిడ్‌ వచ్చినప్పుడు గొంతు దగ్గర వాపు కనిపిస్తుంది. ఈ థైరాయిడ్‌వల్ల అనేక ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. థైరాయిడ్‌ గ్రంథి గొంతులో సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఇది థైరాక్సిన్, ట్రై అయోడో థైరోనిన్ అనే రెండు రకాల హార్మోన్లను స్రవిస్తుంది. ఈ హార్మోన్లు శరీరం పనితీరుకు చాలా అవసరం. థైరాయిడ్‌ సమస్య వస్తే ఈ హార్మోన్‌లు సరిగా ఉత్పత్తికాక రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. థైరాయిడ్‌ సమస్య రాకుండా ఉండాలంటే మెడిసిన్‌తోపాటు కొన్ని ఆహారపరమైన జాగ్రత్తలు కూడా అవసరం. థైరాయిడ్‌ ఉన్నవాళ్లు ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి తినండి..

  • థైరాయిడ్ గ్రంథి తక్కువ పరిమాణంలో హార్మోన్లను ఉత్పత్తి చేస్తే దానిని హైపోథైరాయిడిజం అంటారు. థైరాయిడ్ గ్రంథి అధిక మొత్తంలో హార్మోన్లను ఉత్పత్తి చేస్తే దానిని హైపర్ థైరాయిడిజం అంటారు. ఈ రెండు బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలంటే అది సంబంధిత మందులపై మాత్రమేగాక మీరు తీసుకున్న ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుంది.
  • థైరాయిడ్ రాకూడదంటే వివిధ రకాల పండ్లు, కూరగాయలు, గింజలు, తృణధాన్యాలు ఆహారంగా తీసుకోవాలి. ప్రోటీన్ కోసం చేపలు లేదా బీన్స్‌ లాంటి తక్కువ కొవ్వు ఉన్న వాటిని ఎంచుకోవాలి. వంటలో ఆలివ్ ఆయిల్ లాంటి ఆరోగ్యకరమైన నూనెలను ఉపయోగించాలి. చేపలలో ఉండే ఒమేగా-3 కొవ్వులు చాలా మేలు చేస్తాయి.
  • విత్తనాలు, గింజలు, చిక్కుళ్లను ఆహారంగా తీసుకోవాలి. వాటిలో ఉండే ఫైబర్ జీవక్రియలు సక్రమంగా జరగడానికి సాయపడుతుంది. తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు తినడం ద్వారా శరీరానికి తగిన మొత్తంలో ఫైబర్ అందుతుంది.
  • అయోడిన్ మాత్రలు తీసుకోవడం లేదా అయోడిన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది కాదు. ఇది థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను దెబ్బతీస్తుంది. అలాగే ఉప్పును కూడా పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. అది కూడా సమస్యను అదుపు చేస్తుంది.

Latest News