Follow The Rules For Sleep l ఈ శ‌య‌న నియ‌మాలు పాటిస్తే.. ఆరోగ్యం, ఐశ్వ‌ర్యం మీదే!

Follow the rules for sleep.. విధాత‌: భూమ్మీద పుట్టిన నాటి నుంచి చ‌నిపోయే రోజు వ‌ర‌కు మ‌నిషి త‌ప్ప‌ని స‌రిగా చేసే ప‌ని నిద్ర(sleep) పోవ‌డం. అయితే నిద్రా స‌మ‌యాలు మాత్రం ఒక్కొక్క‌రికి ఒక్కోలా ఉంటాయి. అంతేకాదు చిన్న వ‌య‌స్సు లో ఎక్కువ గంట‌లు.. మ‌ధ్య వ‌య‌స్సు, వృద్ధాప్య ద‌శ‌లో త‌క్కువ గంట‌ల నిద్ర స‌రిపోతుంది మ‌నిషికి. నిద్ర‌పోయేందుకు కేటాయించే స‌మ‌యం, ఆచ‌రించే విధి విధానాల‌పై వారి వారి ఆరోగ్యం, ఆర్థిక‌, మాన‌సిక స్థితిగ‌తులు ఆధార‌ప‌డి […]

  • Publish Date - March 4, 2023 / 11:04 PM IST

Follow the rules for sleep..

విధాత‌: భూమ్మీద పుట్టిన నాటి నుంచి చ‌నిపోయే రోజు వ‌ర‌కు మ‌నిషి త‌ప్ప‌ని స‌రిగా చేసే ప‌ని నిద్ర(sleep) పోవ‌డం. అయితే నిద్రా స‌మ‌యాలు మాత్రం ఒక్కొక్క‌రికి ఒక్కోలా ఉంటాయి. అంతేకాదు చిన్న వ‌య‌స్సు లో ఎక్కువ గంట‌లు.. మ‌ధ్య వ‌య‌స్సు, వృద్ధాప్య ద‌శ‌లో త‌క్కువ గంట‌ల నిద్ర స‌రిపోతుంది మ‌నిషికి.

నిద్ర‌పోయేందుకు కేటాయించే స‌మ‌యం, ఆచ‌రించే విధి విధానాల‌పై వారి వారి ఆరోగ్యం, ఆర్థిక‌, మాన‌సిక స్థితిగ‌తులు ఆధార‌ప‌డి ఉంటాయ‌ని మ‌న పురాణాలు, రుషులు చెప్తున్నారు. మ‌రి ఏ స‌మ‌యంలో నిద్ర పోవాలి? ఎలా నిద్ర పోవాలి? ఏటైంకి లేవాలి? త‌దిత‌ర నియ‌మాల (Rules) గురించి తెలుసుకుందాం..

  • నిర్మానుష్యంగా, నిర్జ‌న గృహంలో ఒంట‌రిగా ప‌డుకోవ‌ద్దు. దేవాల‌యం (Temple), శ్మ‌శాన వాటిక‌లో కూడా ప‌డుకోకూడ‌దు అని మ‌నుస్మృతి చెప్తున్న‌ది.
  • ప‌డుకొని ఉన్న‌వారిని అక‌స్మాత్తుగా నిద్ర‌లేప‌కూడ‌దు అని విష్ణుస్మృతి వివ‌రిస్తుంది. కానీ విద్యార్థి, ద్వార‌పాల‌కుడు అధిక స‌మ‌యం నిద్ర‌పోతున్న‌చో వీరిని లేప‌వ‌చ్చు. కాక‌పోతే నిదానంగా త‌ట్టిలేపాల్సిందే అని చాణ‌క్య‌నీతి తెలియ‌జేస్తుంది.
  • ఆరోగ్య‌వంతులు త‌మ‌ ఆయువు, ఆరోగ్యాన్ని (Health) ర‌క్షించుకునేందుకు త‌ప్ప‌నిస‌రిగా బ్ర‌హ్మ‌ముహూర్తంలో నిద్ర‌లేవాలి అని దేవీ భాగ‌వతంలో ఉంది.
  • పూర్తి చీక‌టిగా ఉన్న గ‌దిలో నిద్ర‌పోవ‌ద్ద‌ని ప‌ద్మ‌పురాణం సూచిస్తుంది.
  • త‌డి పాదాల‌తో నిద్ర ఆరోగ్య ల‌క్ష‌ణం కాదు.. పొడి పాదాల‌తో నిద్ర వ‌ల్ల ధ‌నం ప్రాప్తిస్తుందని అత్రిస్మృతి తెలియ‌జేస్తుంది.
  • విరిగిన ప‌డ‌క‌పై, ఎంగిలి మొహంతో అంటే ఎదైనా తిన్న త‌ర్వాత నోటిని శుభ్రం చేయ‌కుండా ప‌డుకోవ‌డం నిషేధం అని మ‌హాభార‌తం చెప్తున్న‌ది.
  • న‌గ్నంగా, వివ‌స్త్ర‌లులై ప‌డుకోకూడ‌దని గౌత‌మ ధ‌ర్మ‌సూత్రం వివ‌రిస్తుంది.
  • తూర్పు ముఖంగా త‌ల పెట్టి నిద్ర‌పోతే విద్య‌.. ప‌శ్చిమ వైపు త‌ల‌పెట్టి నిద్ర‌పోతే చింత‌.. ఉత్త‌రం వైపు త‌ల పెట్టి నిద్రిస్తే హాని, మృత్యువు.. ఇక‌ ద‌క్షిణ ముఖంగా త‌ల‌పెట్టి నిద్రిస్తే ధ‌నం, దీర్ఘాయువు ప్రాప్తిస్తుందని ఆచార‌మ‌యూఖ్‌లో స్ప‌ష్టంగా రాసి ఉంది.
  • ప‌గ‌టి పూట ఎప్పుడు కూడా నిద్రించ‌వ‌ద్దు. కానీ జ్యేష్ఠ మాసంలో 1ముహూర్తం (48నిమిషాలు) నిద్ర‌ పోవ‌చ్చ‌నే నియ‌మం ఉంది. ప‌గ‌టిపూట నిద్ర పోయే వారు రోగ పీడితుల‌వుతారు. అంతేకాదు ఆయుక్షీణ‌తను క‌లుగ‌జేస్తుంది.
  • సూర్యోద‌యం, సూర్యాస్త‌మ‌యం వ‌రకు ప‌డుకునే వారు రోగి, ద‌రిద్రులు అవుతారని బ్ర‌హ్మ వైవ‌ర్త‌పురాణం స‌వివరంగా తెలియ‌జేస్తుంది.
  • సూర్తాస్త‌మ‌యానికి ఒక ప్ర‌హారం(సుమారు 3గంట‌లు) త‌రువాత నిద్ర పోవాలి.
  • ఎడ‌మ‌వైపు ప‌డుకోవ‌డం వ‌ల్ల స్వ‌స్థ‌త ల‌భిస్తుంది. శ్వాస‌క్రియ స‌క్ర‌మంగా జ‌రిగి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.
  • ద‌క్ష‌ణి దిశ‌లో పాదాలు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రించ‌కూడదు. య‌ముడు, దుష్ట గ్ర‌హాలు నివాసం ఉంటారు. అంతేకాదు ద‌క్షిణ దిశ‌లో కాళ్లు పెట్టి నిద్ర‌పోతే చెవుల్లో గాలి అధికంగా చేరి మెద‌డుకు ర‌క్త స‌ర‌ఫ‌రా మంద‌గిస్తుంది. దీంతో మ‌తిమ‌రుపు, మృత్యువు లేదా అనంత రోగాలు చుట్టుముట్టే అవ‌కాశం ఉంద‌ని పురాణాలు హెచ్చ‌రిస్తున్నాయి.
  • గుండెపై చేయి వేసుకొని, చెట్టు యొక్క బీము కింద‌, కాలుపై కాలు వేసుకొని నిద్రించ‌రాదు. ఇవ‌న్నీ అనారోగ్యానికి దారితీస్తాయ‌ట‌.
  • ప‌డ‌క మీద‌నే తాగ‌డం, తినడం లాంటివి ఎట్టి ప‌రిస్థితుల్లో చేయ‌కూడదు.
  • ప‌డుకొని పుస్త‌క ప‌ఠ‌నం చేయ‌డానికి వీల్లేదని రుషులు నొక్కి చెప్తున్నారు. అలా చేస్తే నేత్ర జ్యోతి మ‌స‌క‌బారుతుందని వివ‌రిస్తున్నారు.

పై నియ‌మాలు పాటించే వారు నిత్యం తేజ‌స్సుతో, ఆరోగ్య వంతంగా త‌మ జీవ‌న ప్ర‌యాణాన్ని సాగించే అవ‌కాశం ఉంది. అంతేకాదు.. దీర్ఘాయుష్మంతులు అవుతారని చెప్ప‌డంలో సందేహం లేదు.

Latest News