Hair Care | జుట్టు సమస్యలా..? అవిసె గింజలతో ఇలా ట్రై చేయండి.. కరీనా కపూర్‌లా జుట్టు మీ సొంతం..!

Hair Care | అందమైన జుట్టు ఎవరు కోరుకోరు. మహిళలు జుట్టు పొడవుగా, బలంగా ఉండాలని కోరుకుంటారు. ఒత్తుగా.. మెరుస్తూ ఉండాలనుకుంటారు. కానీ ప్రస్తుత గజిబిజి జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా జుట్టు ఆరోగ్యం దెబ్బతింటున్నది. స్త్రీలతో పాటు మగ వారికి సైతం జుట్టే మరింత అందాన్ని ఇస్తుంది. కాలుష్యం, పోషకాహార లోపం కారణంగా జుట్టు బలహీనంగా తయారవుతుంది. చాలా తక్కువ మందిలో మాత్రమే వెంట్రుకలు ధృడంగా ఉంటే తప్ప.. జుట్టు పెరగడం కష్టం. అయితే మీరు […]

  • Publish Date - February 1, 2023 / 04:34 AM IST

Hair Care | అందమైన జుట్టు ఎవరు కోరుకోరు. మహిళలు జుట్టు పొడవుగా, బలంగా ఉండాలని కోరుకుంటారు. ఒత్తుగా.. మెరుస్తూ ఉండాలనుకుంటారు. కానీ ప్రస్తుత గజిబిజి జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా జుట్టు ఆరోగ్యం దెబ్బతింటున్నది. స్త్రీలతో పాటు మగ వారికి సైతం జుట్టే మరింత అందాన్ని ఇస్తుంది. కాలుష్యం, పోషకాహార లోపం కారణంగా జుట్టు బలహీనంగా తయారవుతుంది. చాలా తక్కువ మందిలో మాత్రమే వెంట్రుకలు ధృడంగా ఉంటే తప్ప.. జుట్టు పెరగడం కష్టం. అయితే మీరు కూడా.. అవిసె గింజలతో అందమైన జుట్టును పొందవచ్చు. ఎలానో ఓ లుక్కేద్దాం రండి..!

అవిసె గింజలతో ప్రయోజనం

అవిసె గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, అందాన్ని మెరుగుపరిచేందుకు కూడా పనిచేస్తాయి. అవిసె గింజలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బీ, విటమిన్ ఈ వెంట్రుకలు పెరగడానికి సహాయపడతాయి.

అవిసె గింజలతో హెయిర్ జెల్..

అవిసె గిజంలతో హెయిర్ మాస్క్‌ను తయారు చేయవచ్చు. ఇది జుట్టుకు చాలా మేలు చేస్తుంది. అవిసె గింజలను నీటిలో నానబెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం వాటిని ఉడకబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. అలా వచ్చిన జెల్‌ను గాలి చొరబడి డబ్బాలు, సీసాల్లో నిల్వ చేసుకొని.. తరచుగా జుట్టుకు పట్టిస్తూ ఉంటే.. మంచి ఫలితం ఉంటుంది.

హెయిర్ మాస్క్

అవిసె గింజలతో హెయిర్ మాస్క్‌లను చాలా రకాలుగా తయారు చేయవచ్చు. గింజల పొడిని తయారు చేసి, అరటిపండు, పెరుగు లేదా తేనె వంటి వాటితో కలిపి హెయిర్ మాస్క్ వేసుకోవచ్చు. ఈ హెయిర్ మాస్క్ దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేస్తుంది. అలాగే జుట్టును నిగనిగ మెరిసేలా చేస్తుంది. అలాగే అవి గింజలను ఆలివ్ ఆయిల్, నిమ్మరసంతో కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్‌ని జుట్టు మూలాలపై అప్లై చేయాలి కొంత సమయం తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. జుట్టు నిగనిగలాడుతూ బలంగా మారుతుంది.

అవిసె గింజల ఆయిల్‌..

అవిసె గింజల నూనె జుట్టును బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. తలస్నానం చేయడానికి ముందు జుట్టుకు ఆయిల్‌ బాగా పట్టించాలి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా తరుచూ చేయడం ద్వారా జుట్టు రాలడం ఆగిపోతుంది. జుట్టు ఒత్తుగా మారడంతో పాటు నిగనిగలాడుతూ అందమైన జుట్టు మీ సొంతమవుతుంది.

Latest News