Ranapala Plant | ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితం నిలకడ లేకుండా మారింది. అనేక ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. ఈ కారణంగా మానసికంగా కుంగిపోతున్నారు. అంతేకాదు మానసిక ఒత్తిడి జుట్టు( Hair )పై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. జుట్టు రాలిపోవడం జరుగుతుంది. తెల్ల జుట్టు( White Hair ) కూడా వస్తుంది. ఈ రెండు సమస్యలు తీవ్రంగా వేధిస్తాయి. కానీ ఈ రెండు సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రకృతిలో లభించే ఆ ఒక్క ఆకు చాలు. మరి ఆ ఆకు విశేషాలు ఏంటో తెలుసుకుందాం..
ఆ ఆకు ఏంటంటే.. రణపాల ఆకు( Ranapala Leaf ). ఈ మొక్కను రణపాల( Ranapala Plant ), ఆకు మొక్క అని కూడా పిలుస్తుంటారు. వేరు నుంచి, కాండం నుంచి ఈ మొక్క శాఖలు వ్యాప్తి చెందుతాయి. ఒక్క ఆకుని మట్టిలో పూడ్చి పెడితే.. కొత్తగా ఐదు మొక్కల వరకు వస్తాయి. అయితే ఇప్పుడు చాలామందిని వేధిస్తోన్న ప్రధాన సమస్య తెల్లజుట్టు, జుట్టు రాలిపోవడం. ఈ రెండు సమస్యలతో బాధపడే వారు ఈ రణపాల ఆకుని గుజ్జులాగా చేసి జుట్టుకి రాసుకోవడం వల్ల జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు చాలావరకు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తెల్ల జుట్టు కూడా రాదు. జుట్టు ఒత్తుగా వస్తుందని చెబుతున్నారు. కాబట్టి రణపాల ఆకు ఎక్కడ కనిపించినా.. నిర్లక్ష్యం చేయకుండా చేత్తో పట్టుకురండి.. జుట్టుకు పెట్టుకోండి.
అలాగే తలనొప్పి, ఆస్తమా ఉన్నవారు ఈ ఆకు రసం పావు స్పూను తేనెతో కలిపి తీసుకోవడం వల్ల తలనొప్పి, ఆస్తమా తొందరగా తగ్గుతుంది. ఈ రణపాల ఆకు మీద కొబ్బరి నూనె రాసి స్టవ్ మీద ఆకుని రెండు వైపులా వేడిచేసి ఎలాంటి నొప్పి ఉన్నా సరే దానిపై వేసుకొని కట్టుకట్టుకోవాలి. ఇలా మూడు రోజులు.. రోజుకి రెండు,మూడు సార్లు కట్టిన తర్వాత ఎలాంటి నొప్పులు అయినా సరే.. మోకాళ్ళ నొప్పులు అయినా సరే కింద పడ్డప్పుడు గట్టిగా తగిలిన దెబ్బల నొప్పులు నుంచి అయినా సరే రిలీఫ్ పొందుతారు.