Heart Stroke | గుండెపోటు( Heart Stroke ) అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎవరికి ఎప్పుడు గుండెపోటు వస్తుందో తెలియని పరిస్థితి. హార్ట్ స్ట్రోక్ కారణంగా.. ఎక్కడంటే అక్కడ కుప్పకూలిపోతున్నారు. అయితే ప్రధానంగా జీవనశైలి( Life Style )లో చోటు చేసుకున్న మార్పుల కారణంగానే ఈ గుండెపోట్లకు గురవుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. కొన్ని చిట్కాలను రెగ్యులర్‌గా ఫాలో అయితే గుండె సమస్యలను కంట్రోల్ చేయొచ్చని ఆరోగ్య నిపుణులు( Health Experts ) చెబుతున్నారు. మగవారైనా.. ఆడవారైనా ఈ సింపుల్ టిప్స్‌ను ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు. ఇంతకీ జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేయాలి? ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి..
ఒక వ్యక్తి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే.. మొదటగా ఆహారం( Food ) మీద శ్రద్ధ వహించాలి. మనం తీసుకునే ఆహారమే.. మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గుండె( Heart ) ఆరోగ్యంగా ఉండేందుకు సమతుల్యమైన ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పండ్లు( Fruits ), కూరగాయలు( Vegetables ), మల్టీ గ్రైయిన్స్, లీన్ ప్రోటీన్స్ డైట్లో ఉండేలా చూసుకోవాలని చెప్తున్నారు. అలాగే ప్రాసెస్ చేసిన ఫుడ్స్, ఉప్పు( Salt ) ఎక్కువగా ఉండే ఆహారాలు, స్వీట్స్‌ని డైట్లో నుంచి తీసేస్తే బెటర్ అని చెబుతున్నారు.
కొలెస్ట్రాల్‌ను కంట్రోల్‌లో ఉంచాలి..
శరీరంలో కొలెస్ట్రాల్(Cholesterol ) ఉంటే గుండె సమస్యలు కొని తెచ్చుకున్నట్టే. అందుకే కొలెస్ట్రాల్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవాలంటున్నారు నిపుణులు. ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటే అది గుండెను బ్లాక్ చేసి.. శరీరంలోని వివిధ భాగాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దీనిని తగ్గించుకునేందుకు రెగ్యూలర్‌గా వ్యాయామం చేయడంతో పాటు.. ఫ్యాచురేటడ్ డైట్ ఫాలో అవ్వాలి. ఇవి కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసి గుండెను హెల్తీగా ఉంచుతాయి.
అర గంటైనా వ్యాయామం చేయాలి..
రోజూ కనీసం అరగంటైనా వ్యాయామం చేయాలి. లేదంటే ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. కార్డియో చేస్తే మరీ మంచిది. సైకిల్, వాకింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ చేస్తూ ఉంటే గుండెకు మెరుగైన రక్తప్రసరణ అందుతుంది. దీనివల్ల గుండె సమస్యలు దూరమవుతాయి. వీటితో కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది.
స్మోకింగ్, మద్యపానానికి దూరంగా ఉండాలి..
స్మోకింగ్ అలవాటు ఉండేవారికి క్యాన్సర్‌తో పాటు.. గుండె సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పొగాకు ఉపయోగించేవారిలో గుండె సమస్యలు ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయనాలు ఇప్పటికే తేల్చాయి. కాబట్టి వీలైనంత త్వరగా స్మోకింగ్ మానేస్తే మంచిది. దీనివల్ల హార్ట్ ఎటాక్, గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి. అతిగా మద్యం సేవించడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండె సమస్యలను రెట్టింపు చేస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా దీనిని మానేయాలంటున్నారు.
బరువు తగ్గాల్సిందే.. 7 గంటలు నిద్రించాల్సిందే..
అధిక బరువు వివిధ ఆరోగ్య సమస్యలను తీసుకువస్తుంది. అందుకే బరువును తగ్గించుకోవాలి. ముఖ్యంగా బరువు ఎక్కువగా ఉంటే గుండె ఆరోగ్యానికే ప్రమాదం. హెల్తీ డైట్, రెగ్యూలర్ వ్యాయామం.. నిద్రను ఫాలో అయితే బరువును కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక రోజూ కనీసం 7 గంటలు నిద్ర ఉండాలి. రాత్రి నిద్ర ఎంత బాగా ఉంటే.. గుండె సమస్యలు అంత దూరమవుతాయి. ఎంత తక్కువ ఉంటే గుండె సమస్యలు అంత తీవ్రమవుతాయి.