Health tips | ఇవి రెగ్యులర్‌గా తీసుకుంటే మీలో వ్యాధినిరోధ‌క శ‌క్తి అమాంతం పెరుగుతుందట..!

Health tips : క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా వ్యాధినిరోధ‌క శ‌క్తి గురించే చ‌ర్చ జ‌రుగుతున్నది. శరరంలో వ్యాధినిరోధ‌క శ‌క్తిని పెంచుకుంటే క‌రోనా అంత‌గా ప్రభావం చూప‌ద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుండ‌టంతో.. అంద‌రూ వ్యాధినిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహార ప‌దార్థాలేవో తెలుసుకుని వాటినే ఎక్కువ‌గా తీసుకుంటున్నారు.

  • Publish Date - May 17, 2024 / 03:02 PM IST

Health tips : క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా వ్యాధినిరోధ‌క శ‌క్తి గురించే చ‌ర్చ జ‌రుగుతున్నది. శరరంలో వ్యాధినిరోధ‌క శ‌క్తిని పెంచుకుంటే క‌రోనా అంత‌గా ప్రభావం చూప‌ద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుండ‌టంతో.. అంద‌రూ వ్యాధినిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహార ప‌దార్థాలేవో తెలుసుకుని వాటినే ఎక్కువ‌గా తీసుకుంటున్నారు. మ‌రి ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను అధికం చేసే ఆ ఆహార‌ ప‌దార్థాలేవో మ‌నం కూడా తెలుసుకుందాం..

ఇమ్యూనిటీ ఫుడ్స్..

  • శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపు కోసం ప్రోబయోటిక్స్ ఎక్కువ‌గా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. పెరుగులో ప్రోబ‌యోటిక్స్ స‌మృద్ధిగా ఉంటాయి. అంతేగాక‌ పెరుగు అనేక వ్యాధి కార‌కాల‌ను నిర్మూలిస్తుంది. ఒంట్లో మంటను కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజు ఒక కప్పు పెరుగు తీసుకోవడంవల్ల వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది.
  • వ్యాధి నిరోధక శక్తి పెరుగడానికి గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.
  • విటమిన్ డి ఎక్కువ‌గా ఉండే ఆహారాలను తీసుకోవడంవల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ డి సాధారణంగా సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. అదేవిధంగా సాల్మన్‌ చేపలు, బలవర్ధకమైన పాలలో కూడా విటమిన్ డి ఉంటుంది.
  • పుట్టగొడుగులు కూడా వ్యాధినిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో కీల‌క‌పాత్ర పోషిస్తాయి. విటమిన్ బి, ప్రొటీన్, ఫైబర్, విటమిన్ సి, క్యాల్షియం, ఇతర ఖనిజాలు ఉండటంవల్ల వీటితో రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. యాంటీ ఇన్ఫెక్షన్ కార్యకలాపాల కోసం పుట్టగొడుగులు తెల్ల రక్త కణాలను ఉత్తేజపరుస్తాయి. కాబ‌ట్టి రోగనిరోధక శక్తి పెరుగాలంటే ప్రతిరోజు ఒక కప్పు పుట్టగొడుగులు తినడం మంచిది.

Latest News