Site icon vidhaatha

New Finance Year | కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చేసింది.. బంగారం నుంచి సిగరెట్ల వరకు ధరలు పెరగనున్నవి ఇవే..!

New Finance Year |

విధాత: కొత్త ఆర్థిక సంవత్సరం నేటి నుంచి నేటితో ప్రారంభంకానున్నది. ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో పలు రకాల వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయి. స్థానికంగా తయారైన వస్తువులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విధితమే.

బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ఆర్థిక మంతి నిర్మలా సీతారామన్‌ పెరుగుదలపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రైవేట్ జెట్ విమానాలు, హెలికాప్టర్లు, అత్యాధునిక ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, ఆభరణాలు, హై గ్లోస్ పేపర్, విటమిన్ ప్రొడక్ట్స్, ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలు లాంటి వస్తువలతో పాటు సిగరెట్లు, బంగారం, ప్లాటినం తదితరాల వస్తువులు పెరుగనున్నాయి. కేంద్రం గత బడ్జెట్‌లో చాలారకాల దిగుమతి వస్తువులపై పన్నును పెంచింది.

కిచెన్ ఎలక్ట్రిక్ చిమ్నీలపై కస్టమ్స్ టాక్స్ 7.5 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. అదే సమయంలో సిగరెట్లు, పాన్ మసాలాలాంటి తదితర పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ పరిహార సెస్ గరిష్ట రేటు, పరిమితిని ప్రభుత్వం నిర్ణయించింది. జీఎస్టీ పరిహార సెస్‌ను ఇతర వస్తువులతో పాటు.. రిటైల్ అమ్మకం ధర సీలింగ్ రేటుకు జోడించింది.

తాజాగా ఆమోదించిన ఫైనాన్స్‌ బిల్‌-2023లో ప్రవేశపెట్టిన సవరణల్లో భాగంగా కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. దీంతో పాన్ మసాలా ఉత్పత్తిపై వేసే 135 శాతం టాక్స్ స్థానంలో యూనిట్‌కు 51శాతం జీఎస్టీ ఉండనున్నది. వేయికిపైగా పొగాకు స్టిక్‌లకు రూ.4170+ 290 శాతం యూనిట్ రిటైల్ ఉంటుంది. అంతేకాకుండా జీఎస్టీ రేటు 28శాతంపైన సెస్ వేయబోతున్నారు. దాంతో పాన్ మసాలా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల ధరలు పెరగనుండగా.. నేటి నుంచి అమలులోకి రానున్నాయి.

ధరలు తగ్గనున్న వస్తువులివే..

బడ్జెట్‌లో భాగంగా కొన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతుండగా.. కొన్ని ధరలు సైతం తగ్గనున్నాయి. ఆ జాబితాలో కెమెరా లెన్స్‌లు, మొబైల్ ఫోన్‌లు, ల్యాబ్‌లో తయారుచేసిన వజ్రాల ధరలు తగ్గుతాయి. అలాగే లిథియం-అయాన్ బ్యాటరీల కోసం ఉపయోగించే మెషీన్లు, ఈవీ ఇండస్ట్రీకి సంబంధించిన ముడి పదార్థాలు కాస్త చౌకగా మారనున్నాయి.

అంతేకాకుండా ఆటవస్తువులు, సైకిళ్లు, టీవీ, మొబైల్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఎల్ఈడీ టీవీలు, మిథైల్ ఆల్కహాల్, ఎసిటిక్ యాసిడ్, పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమైన రసాయనాల ధరలు సైతం తగ్గనున్నాయి.

Exit mobile version