విధాత: ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను ఏప్రిల్ 1 నుంచి క్రమబద్దీకరిస్తాం అని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సెర్ఫ్ ఉద్యోగుల పేస్కేల్‌ను ఏప్రిల్ 1 నుంచి సవరిస్తాం అని చెప్పారు. సోషియో ఎకానమిక్ సర్వే విడుదల సందర్భంగా.. హరీశ్‌రావు ఈ విషయాన్ని మరోసారి ఉద్ఘాటించారు.
రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన 80 వేల ఉద్యోగ నియామక ప్రక్రియ వేగంగా కొనసాగుతోందన్నారు. ఇప్పటికే ఆరోగ్య శాఖలో 950 మందిని భర్తీ చేశామన్నారు. పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీ చివరి దశలో ఉంది. ఈ నేపథ్యంలో అన్ని శాఖల్లో భర్తీ కాబోయే కొత్త ఉద్యోగుల కోస బడ్జెట్‌లో రూ. 1000 కోట్లు కేటాయించాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
33 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలు చేయబోతున్నాం అని హరీశ్‌రావు ప్రకటించారు. ఇందు కోసం బడ్జెట్‌లో రూ. 200 కోట్లు కేటాయించామని తెలిపారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు ఈబడ్జెట్‌లో రూ. 460 కోట్లు అధికంగా కేటాయించామన్నారు. గతంలో రూ. 2,750 కోట్లు కేటాయిస్తే, ఈ బడ్జెట్‌లో రూ. 3,210 కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు.