Site icon vidhaatha

Toll Tax Hike | APR 1 నుంచి ‘టోల్‌బాదుడు’.. ఆ రహదారులపై ప్రయాణం మరింత ప్రియం..!

Toll Tax Hike | వాహనదారులకు షాక్‌ ఇచ్చేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ సిద్ధమైంది. టోల్‌టాక్స్‌ను పెంచేందుకు నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా నిర్ణయించింది. పెరిగిన చార్జీలు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. దాంతో వాహనదారులకు జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌ హైవేలపై ప్రయాణం భారం కానున్నది.

దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాల వద్ద దాదాపు 5శాతం నుంచి 10శాతం వరకు టోల్‌ టాక్స్‌ పెంచాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది. జాతీయ రహదారుల ఫీజుకు సంబంధించిన రూల్స్‌ 2008 ప్రకారం సవరించగా.. రేట్ల ప్రతిపాదనను ఈ నెల 25 వరకు కేంద్ర రోడ్లు, రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదానికి చేరింది.

కేంద్ర రవాణాశాఖ ఆమోదం తెలిపితే.. వచ్చే నెల నుంచి చార్జీల బాదుడు మొదలుకానున్నది. కార్లు, తేలికపాటి వాహనాలపై ఒక్కో ట్రిప్పుకు 5శాతం, భారీ వాహనాలపై అదనంగా 10 శాతం టోల్‌చార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది. ఇంతకు ముందు 2022లో టెల్‌ టాక్స్‌ను 10-15శాతం పెరిగింది. గతేడాదితో పోలిస్తే స్వల్పంగా పెంచనున్నారు.

ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో చార్జీలను సమీక్షించి.. అందుకు అనుగుణంగా పెచుతూ వస్తున్నారు. ఇప్పటికే ధరల పెరుగుదలతో అల్లాడుతున్న జనానికి టోల్‌ చార్జీల పెంపు మరింత భారం కానున్నది. తెలంగాణ, ఏపీ పరిధిలో దాదాపు 70 వరకు టోల్‌ప్లాజాలు ఉండగా.. పెరిగిన చార్జీలు అమలులోకి రానున్నాయి.

Exit mobile version