smoking | ధూమపానంతో అకాల మరణాలు..! హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..!

smoking | ఆరోగ్యకరమైన జీవనశైలి, అలవాట్లే సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. మనకున్న కొన్ని దురలవాట్లు ఆరోగ్యానికి అనేక రకాల హాని కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన సమస్యలతో పాటు మరణానికి కారణం అయ్యే అవకాశాలున్నాయి. ఇలాంటి అలవాట్లలో ధూమపానం ఒకటి. ధూమపానంతో ఊపిరితిత్తులు దెబ్బతినడమే కాకుండా గుండెజబ్బులు, క్యాన్సర్‌ ముప్పు గణనీయంగా పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. ఇతర వ్యక్తులతో పోలిస్తే.. ధూమపానం అలవాటున్న వ్యక్తుల్లో అకాల మరణాలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు గుర్తించారు. ధూమపానం […]

  • Publish Date - December 6, 2022 / 10:32 AM IST

smoking | ఆరోగ్యకరమైన జీవనశైలి, అలవాట్లే సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. మనకున్న కొన్ని దురలవాట్లు ఆరోగ్యానికి అనేక రకాల హాని కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన సమస్యలతో పాటు మరణానికి కారణం అయ్యే అవకాశాలున్నాయి. ఇలాంటి అలవాట్లలో ధూమపానం ఒకటి. ధూమపానంతో ఊపిరితిత్తులు దెబ్బతినడమే కాకుండా గుండెజబ్బులు, క్యాన్సర్‌ ముప్పు గణనీయంగా పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. ఇతర వ్యక్తులతో పోలిస్తే.. ధూమపానం అలవాటున్న వ్యక్తుల్లో అకాల మరణాలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు గుర్తించారు. ధూమపానం దుష్ప్రభావాలను తెలుసుకునేందుకు చేసిన అధ్యయనంలో ఈ అలవాటు శరీరానికి హానికారకమని తేలింది. ఇటీవల భారతీయ యువతలో ధూమపాన సేవనం ప్రమాదకరంగా వేగంగా పెరుగుతున్నది. ప్రతి ఒక్కరూ ధూమపానినిక దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరణాలకు సిగరెట్లు కారణం..!

సిగరేట్స్‌ పొగ పీల్చడం వల్ల అమెరికాలో ప్రతి సంవత్సరం మిలియన్ల కొద్దీ జనం మరణిస్తున్నారని సీడీసీ డేటా పేర్కొంది. ప్రతి ఐదు మరణాల్లో ఒకరి మృతి ధూమపానం ప్రధాన కారణం. 90శాతం ఉత్పతిత్లు క్యాన్సర్‌కు సిగరెట్లే కారణమని భావిస్తున్నారు. పురుషులతో పాటు స్త్రీల్లో కూడా ఇదే ప్రధాన కారణంగా గుర్తించారు. వీటితో పాటు శ్వాసకోశ వ్యాధులతో పాటు శరీరంలోని అనేక భాగాలపై తీవ్రమైన దుష్ప్రభావాలు కనిపించినట్లు నిపుణులు తెలిపారు.

కుచించుకుపోతున్న రక్త నాళాలు

ఊపిరితిత్తులతో పాటు హృదయ నాళ వ్యవస్థపై సిగరెట్ల పొగ ప్రభావం చూపుతుంది. సిగరెట్లలో ఉండే నికోనిట్‌ రక్త నాళాలు కుచించుకుపోయేందుకు కారణమవుతోంది. దీంతో రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తుంది. కాలక్రమేణా రక్త నాళాలు పూర్తిగా దెబ్బతిని పెరిఫెరల్‌ ఆర్టరీ వ్యాధికి దారి తీస్తుంది. ధూమపానం బీపీని పెంచడంతో పాటు గుండెపోటు, స్ట్రోక్‌ వంటి ప్రమాదాలను పెంచుతుంది.

పొంచి ఉన్న క్యాన్సర్‌ ముప్పు

పొగను పీల్చే వ్యక్తులకు ఉపిరిత్తుల క్యాన్సర్‌తో పాటు స్టమక్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే నోటి, గొంతు, స్వరపేటిక, అన్నవాహిక క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు గుర్తించారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రేటు సైతం ధూమపానం చేసేవారిలో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ధూమపానాన్ని సకాలంలో నిలిపివేస్తే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఇన్సులిన్‌పై ధూమపానం ప్రభావం

ధూమపానం అలవాటు ఇన్సులిన్ సెన్సిటివిటీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది మధుమేహం ముప్పును గణనీయంగా పెంచుతుంది. ధూమపానం చేసేవారిలో రోగనిరోధక శక్తి తగ్గిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల ఇన్ఫెక్షన్ల వచ్చే సమస్యలు కూడా పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మానుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.

Latest News