Kidney health | కిడ్నీలు సమర్థంగా పనిచేయాలంటే మీ ఆహారంలో ఇవి కచ్చితంగా ఉండాల్సిందే..!

  • Publish Date - April 10, 2024 / 11:30 AM IST

Kidney health : కిడ్నీలు..! మ‌న దేహంలోని అతి ముఖ్యమైన అవ‌య‌వాల్లో ఇవి కూడా ఒక‌టి. శ‌రీరంలోని మ‌లినాల‌ను తొల‌గించి శుభ్రంగా ఉంచ‌డంలో కిడ్నీలు కీల‌కపాత్ర పోషిస్తాయి. మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పటిక‌ప్పుడు మ‌లినాలు తొల‌గిపోవాలి. మ‌లినాలు తొల‌గిపోవాలంటే కిడ్నీల పనితీరు బాగుండాలి. లేదంటే శరీరం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. మరి కడ్నీలు సమర్థంగా పని చేయాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను మీ డైట్‌లో కచ్చితంగా చేర్చుకోవాల్సిందే. మ‌రి అవేంటో తెలుసుకుందామా..

1. వెల్లుల్లి

వెల్లుల్లిని మూత్రపిండాల ర‌క్షణ‌కు మంచి ఆహారంగా చెప్పవచ్చు. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్‌, యాంటీ క్లాటింగ్‌‌ కణాలు ఉండటంవల్ల చెడు కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను త‌గ్గిస్తుంది.

2. బెర్రీస్‌

బెర్రీస్ వివిధ‌ రంగుల్లో లభ్యమ‌వుతాయి. వాటిలో బ్లాక్‌బెర్రీ మిన‌హా మిగతా అన్ని రకాల బెర్రీలు కిడ్నీల‌కు మేలు చేసేవే. స్ట్రాబెర్రీ, క్రాన్‌ బెర్రీస్‌, బ్లూబెర్రీస్‌ అన్నింటిలోనూ న్యూట్రియంట్స్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరి క్వాలిటీస్ స‌మృద్ధిగా ఉంటాయి. అందుకే అవి వ్యాధి నిరోధకతను పెంచి బ్లాడర్‌ ఫంక్షన్స్‌ సక్రమంగా ఉండేందుకు దోహ‌ద‌ప‌డుతాయి.

3. మొలకెత్తిన విత్తనాలు

శ‌న‌గ‌లు, పెస‌ర్లు లాంటి ధాన్యాల‌ను త‌ర‌చూ మొలకెత్తించి తినడంవల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిలోని ఫైబ‌ర్ శ‌రీరంలోని మ‌లినాల‌ను త‌న‌తో క‌లుపుకుని విస‌ర్జిత‌మ‌వుతుంది. అందువ‌ల్ల మూత్రపిండాలు శుభ్రప‌డి కిడ్నీల్లో రాళ్ల స‌మ‌స్య రాకుండా ఉంటుంది.

4. క్యాబేజీ

క్యాబేజీ మూత్రపిండాల పనితీరును మెరుగుపర్చడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. సాధారణంగా క్యాబేజీని కిడ్నీల‌ డ్యామేజ్‌ను అరికట్టే సహజ ఔషధంగా వినియోగిస్తారు.

5. ఉల్లిపాయ

ఉల్లిపాయలు కిడ్నీల్లో రాళ్లను తొల‌గించ‌డానికి తోడ్పడుతాయి. అంతేగాక‌ మూత్రపిండాలను నిర్విషీకరణ చేయ‌డంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి.

Latest News