Health Tips | మహిళల ఆరోగ్యానికి ఈ ఆరు రకాల గింజలు అత్యంత కీలకం.. అవేంటో తెలుసా..?

Health Tips : పాలిసిస్టైన్ ఓవ‌రీ సిండ్రోమ్ (PCOS), పాలిసిస్టైన్ ఓవరీ డిసీజ్ (PCOD) అనేవి ఈ రోజుల్లో మహిళల్లో స‌ర్వసాధార‌ణ స‌మ‌స్యలుగా మారిపోయాయి. ప్రపంచ‌వ్యాప్తంగా ప్రతి పదిమంది మ‌హిళ‌ల్లో ఒక‌రు ఈ స‌మ‌స్యలతో బాధ‌ప‌డుతున్నారు. చాలామంది మ‌హిళ‌ల్లో ఇన్సులిన్ నిరోధం కార‌ణంగా ఈ స‌మ‌స్యలు వ‌స్తున్నట్లు తేలింది. ఇన్సులిన్ నిరోధంవ‌ల్ల హార్మోన్‌ల విడుద‌ల‌లో అస‌మ‌తుల్యత ఏర్పడి, చక్కెర‌ల వినియోగం ఎక్కువ జ‌రగక షుగ‌ర్ లెవ‌ల్స్ పెరిగిపోయే ప్రమాదం కూడా ఉంది.

  • Publish Date - April 15, 2024 / 07:47 AM IST

Health Tips : పాలిసిస్టైన్ ఓవ‌రీ సిండ్రోమ్ (PCOS), పాలిసిస్టైన్ ఓవరీ డిసీజ్ (PCOD) అనేవి ఈ రోజుల్లో మహిళల్లో స‌ర్వసాధార‌ణ స‌మ‌స్యలుగా మారిపోయాయి. ప్రపంచ‌వ్యాప్తంగా ప్రతి పదిమంది మ‌హిళ‌ల్లో ఒక‌రు ఈ స‌మ‌స్యలతో బాధ‌ప‌డుతున్నారు. చాలామంది మ‌హిళ‌ల్లో ఇన్సులిన్ నిరోధం కార‌ణంగా ఈ స‌మ‌స్యలు వ‌స్తున్నట్లు తేలింది. ఇన్సులిన్ నిరోధంవ‌ల్ల హార్మోన్‌ల విడుద‌ల‌లో అస‌మ‌తుల్యత ఏర్పడి, చక్కెర‌ల వినియోగం ఎక్కువ జ‌రగక షుగ‌ర్ లెవ‌ల్స్ పెరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. అయితే పోష‌కాహారం తీసుకునే వారిలో ఈ PCOS, PCOD స‌మ‌స్యలు త‌గ్గుముఖం ప‌ట్టడమేగాక, బ‌రువు కూడా త‌గ్గుతున్నట్లు ఓ ప‌రిశోధ‌న‌లో తేలింది. మ‌హిళ‌లు త‌ర‌చూ ఈ ఆరు ర‌కాల గింజ‌లు తీసుకోవ‌డంవ‌ల్ల హార్మోన్‌లు స‌మంగా విడుద‌లై స‌మ‌స్యకు పరిష్కారం ల‌భిస్తుంది. మ‌రి ఆ గింజ‌లేమిటో తెలుసుకుందాం…

1. చియా గింజ‌లు

చియా గింజ‌ల్లో ఒమేగా-3 ఫ్యాటీ అమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేగాక ఫైబ‌ర్‌, ఐర‌న్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, కాల్షియం కూడా పుష్కలంగా ల‌భిస్తాయి. ఇవి మ‌నిషి శ‌రీర బ‌రువు త‌గ్గడానికి, ర‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ మెరుగుప‌డ‌టానికి తోడ్పడుతాయి. గుండె జ‌బ్బుల‌తో బాధ‌ప‌డుతున్న వారిలో స‌మ‌స్యను త‌గ్గించ‌డానికి కూడా ఈ చియా గింజ‌లు తోడ్పడుతాయి.

2. పొద్దుతిరుగుడు గింజ‌లు

పొద్దు తిరుగుడు గింజ‌ల్లో సెలెనియం పుష్కలంగా ఉంటుంది. ఇది కాలేయ నిర్విషీక‌ర‌ణ‌కు తోడ్పడి హార్మోన్‌ల స‌క్రమ విడుద‌ల‌కు దోహ‌దం చేస్తుంది. అంతేగాక ఫ్యాట్ కంటెంట్ కూడా పొద్దు తిరుగుడులో చాలా ఎక్కువ‌. యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్షణాలుంటాయి. పైగా ఫైబ‌ర్‌లు, ప్రొటీన్‌లు కూడా ఈ పొద్దుతిరుగుడు గింజ‌ల్లో ఎక్కువ‌గా ఉంటాయి.

3. గుమ్మడి గింజ‌లు

గుమ్మడి గింజ‌ల్లో మెగ్నీషియం స‌మృద్ధిగా ల‌భిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే గుమ్మడి గింజ‌ల‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌డంవ‌ల్ల మోనోపాజ్ త‌ర్వాత మ‌హిళ‌లు ఆస్టియోపోరోసిస్ బారిన‌ప‌డే రిస్క్ త‌గ్గుతుంది.

4. అవిసె గింజ‌లు

అవిసె గింజ‌ల్లో ఒమేగా-3 ALA, ఫైబ‌ర్ కంటెంట్‌ కావాల్సినంత ఉంటాయి. ఇవి హార్మోన్‌లను స‌మ‌తాస్థితిలో ఉంచ‌డానికి తోడ్పడుతాయి. PCOS, PCOD స‌మ‌స్యలవ‌ల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ను కూడా నిరోధిస్తాయి. అదేవిధంగా శ‌రీరంలో ఈస్ట్రోజ‌న్ ఉత్పత్తికి దోహ‌దం చేస్తాయి. అంతేగాక సంతాన సాఫ‌ల్యత‌ను కూడా పెంచుతాయి.

5. నువ్వు గింజ‌లు

నువ్వు గింజ‌ల్లో కాల్షియం, జింక్‌, మెగ్నీషియం స‌మృద్ధిగా ఉంటాయి. అదేవిధంగా ప్రొటీన్‌లు కూడా ఈ నువ్వు గింజ‌ల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోన్‌ల అస‌మాన‌త‌ల‌ను క్రమ‌బ‌ద్దీక‌రించ‌డంలో బాగా ఉప‌యోగ‌ప‌డుతాయి.

6. జ‌నుము గింజ‌లు

జ‌నుము గింజ‌ల్లో GLAగా పిలిచే ఒక ర‌క‌మైన‌ ఒమేగా-6 ఫ్యాట్ ఉంటుంది. హార్మోన్‌ల‌ను క్రమ‌తాస్థితిలో ఉంచ‌డానికి జనుములు తోడ్పడుతాయి. వీటిలో ఫైటో కాంపౌండ్స్ కూడా విరివిగా ఉంటాయి. ఇవి మ‌హిళ‌ల్లో మోనోపాజ్ ద‌శ‌లో వ‌చ్చే దుష్ప్రభావాల‌ను నిరోధిస్తాయి.

Latest News