Salman Khan | బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ భావోద్వేగంతో కన్నీరు పెట్టుకోవడం చాలా అరుదు. ఎప్పుడూ సరదాగా, కూల్ అటిట్యూడ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ‘దబాంగ్’ స్టార్ ఈసారి మాత్రం హిందీ బిగ్ బాస్ వేదికపై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దివంగత ప్రముఖ నటుడు ధర్మేంద్ర గురించి మాట్లాడుతుండగా ఆయన కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.
ధర్మేంద్ర మరణించడంతో సల్మాన్ ఆవేదన
ఇటీవల మరణించిన వెటరన్ నటుడు ధర్మేంద్రకి బిగ్ బాస్ టీమ్ ప్రత్యేక నివాళి అర్పించింది. ఆయన గతంలో షోకి గెస్ట్‌గా వచ్చిన ఎపిసోడ్ నుంచి సన్నివేశాలను మళ్లీ ప్రదర్శించారు. ఆ వీడియోను చూసిన సల్మాన్ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చేశారు. తన మనసులోని భావాలను సల్మాన్ భావోద్వేగ స్వరంతో బయటపెట్టారు. మనం నిజమైన హీమ్యాన్‌ను కోల్పోయాం. నేను చూసిన గొప్ప వ్యక్తుల్లో ధర్మేంద్ర గారు ముందు వరుసలో ఉంటారు. ఆయనలాంటి నటుడు మళ్లీ దొరకరు. నా పుట్టినరోజు నాడే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లడం నా హృదయాన్ని మరింత బాదించింది. మిస్ యూ ధర్మేంద్ర జీ… అని చెబుతూ ఆయన తన కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.
ఫ్యాన్స్ షాక్..! సల్మాన్ ఇలా ఎప్పుడూ చూడలేదు
సాధారణంగా బిగ్ బాస్ వేదికపై సల్మాన్ ఖాన్ సీరియస్ గానో, సరదా గానో, తనదైన హ్యూమర్‌తో కంటెస్టెంట్స్‌ను, ప్రేక్షకులను అలరించడమే చూస్తూ ఉంటాం. కానీ ఇలా బహిరంగ వేదికపై భావోద్వేగాలకు లోనై ఏడవడం చాలా అరుదని అభిమానులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయన స్పందనపై అనేక కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.ధర్మేంద్ర–సల్మాన్ మధ్య ఉన్న పర్సనల్ బాండ్, పరస్పర గౌరవం, ప్రేమ ఈ ఘటనతో మరోసారి బయటపడింది.
ధర్మేంద్ర భౌతికంగా లేరు… కానీ ఆయన వారసత్వం చిరస్థాయిగా
బాలీవుడ్ ‘హీమ్యాన్’ లక్షలాది మంది అభిమానుల హృదయాలలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. ధర్మేంద్రను గుర్తుచేసుకుంటూ సల్మాన్ కన్నీళ్లు పెట్టుకోవడం ఆయన వ్యక్తిత్వంపై ఉన్న అభిమానానికీ, గౌరవానికీ నిదర్శనం.
