విధాత : బిగ్‌బాస్-19 (హిందీ) విన్నర్(Bigg Boss 19 winner) గా టీవీ నటుడు గౌరవ్ ఖన్నా( TV Actor Gaurav Khanna) నిలిచారు. ఫైనల్ కార్యక్రమంలో గౌరవ్‌ను హోస్ట్ సల్మాన్ ఖాన్(Salman Khan) విజేతగా ప్రకటించారు. ఫర్హానా భట్ రన్నరప్‌గా నిలిచారు. సానుకూలత, టాస్కుల్లో నేర్పరితనం, వివాదాలకు దూరంగా ఉండటమే ఆయన గెలుపునకు కారణమని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గౌరవ్‌కు ట్రోఫితో పాటు ప్రైజ్‌మనీగా రూ.50 లక్షలు దక్కింది. టాప్-5లో అమల్ మల్లిక్, తాన్యా మిట్టల్, గౌరవ్ ఖన్నా, ప్రణిత్ మోర్, ఫర్హానా భట్ నిలిచారు. అయితే, ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం గౌరవ ఖన్నా విజేతగా ఎంపికయ్యాడు.
గౌరవ ఖన్నా అనుపమ, సీఐడీ వంటి టీవీ సిరియల్స్ తో గుర్తింపు పొందాదరు. బిగ్ బాస్ లో తన ప్రదర్శనతో విజేతగా నిలిచారు. బిగ్ బాస్ హౌస్ లో అత్యధిక పారితోషికం పొందిన కంటెస్టెంట్ లో ఒకరిగా ఉన్నాడు. వారానికి రూ. 17.5లక్షల పారితోషికం అందుకున్నాడు. విజేతగా రూ.50లక్షల ప్రైజ్ మనీ కూడా దక్కించుకున్నాడు. గతేడాదిలో జరిగిన సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ కార్యక్రమంలో కూడా ఆయన 12మందితో పోటీ పడి విజేతగా నిలిచారు.
