Tomato | ట‌మాటాతో మ‌గాళ్లకు బోలెడ‌న్ని లాభాలు.. సంతానోత్ప‌త్తి సామ‌ర్థ్యం పెరుగుతుంద‌ట‌..!

Tomato | ట‌మాటా.. ఈ పేరు వింటేనే నిన్న‌, మొన్న‌టి వ‌ర‌కు గుండెలు గుభేలుమ‌న్నాయి. నేటి నుంచి ట‌మాటా ధ‌ర‌లు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఇక ట‌మాటా లేకుండా కూర చేయ‌డం కూడా క‌ష్ట‌మే. మొత్తానికి పెరిగిన ధ‌ర‌ల‌తో కూర‌ల్లో ట‌మాటా వాడ‌ట‌మే మానేశారు. అయితే ఈ ట‌మాటాల వ‌ల్ల మ‌గాళ్ల‌కు బోలేడ‌న్ని లాభాలు ఉన్నాయ‌ని ప‌లు ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. రోజు ట‌మాటా తిన‌డం వ‌ల్ల పురుషుల్లో సంతానోత్ప‌త్తి సామ‌ర్థ్యం పెరుగుతుంద‌ని వెల్ల‌డైంది. ప్ర‌పంచంలో చాలా మందిని […]

  • Publish Date - August 13, 2023 / 03:41 PM IST

Tomato |

ట‌మాటా.. ఈ పేరు వింటేనే నిన్న‌, మొన్న‌టి వ‌ర‌కు గుండెలు గుభేలుమ‌న్నాయి. నేటి నుంచి ట‌మాటా ధ‌ర‌లు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఇక ట‌మాటా లేకుండా కూర చేయ‌డం కూడా క‌ష్ట‌మే. మొత్తానికి పెరిగిన ధ‌ర‌ల‌తో కూర‌ల్లో ట‌మాటా వాడ‌ట‌మే మానేశారు. అయితే ఈ ట‌మాటాల వ‌ల్ల మ‌గాళ్ల‌కు బోలేడ‌న్ని లాభాలు ఉన్నాయ‌ని ప‌లు ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.

రోజు ట‌మాటా తిన‌డం వ‌ల్ల పురుషుల్లో సంతానోత్ప‌త్తి సామ‌ర్థ్యం పెరుగుతుంద‌ని వెల్ల‌డైంది. ప్ర‌పంచంలో చాలా మందిని వ్యంధ‌త్వ స‌మ‌స్య వేధిస్తోంది. ఈ కార‌ణంగా చాలా మంది దంప‌తుల‌కు పిల్ల‌లు పుట్ట‌డం లేదు. ఈ క్ర‌మంలోనే పురుషుల‌కు సంతానోత్ప‌త్తి సామ‌ర్థ్యాన్ని పెంచేందుకు గ‌ల అవ‌కాశాల‌పై ప‌రిశోధ‌కులు ప‌రిశోధ‌న‌లు చేస్తూనే ఉన్నారు.

అయితే ట‌మాటాలో ఉండే లైకోపీన్ వ‌ల్ల వీర్యం నాణ్య‌త కూడా మెరుగుప‌డుతుంద‌ని ఓ అధ్య‌య‌నంలో తేలింది. టమాటాలో విటమిన్ ఇ, జింక్ లాగే లైకోపీన్ కూడా మంచి యాంటీ యాక్సిడెంట్‌లా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్ర‌తి రోజూ రెండు చెంచాల ట‌మాటా జ్యూస్ లేదా, ట‌మాటాను నేరుగా తిన్న మంచిదే అని పరిశోధ‌కులు సూచిస్తున్నారు.

అంతేకాకుండా పిల్ల‌లు కూడా ఆరోగ్యంగా, ఎలాంటి లోపాలు లేకుండా పుట్టే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. అయితే సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కొంటున్న పురుషులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడంతో పాటు మంచి జీవనశైలిని అనుసరించాలని చెబుతున్నారు వైద్యులు. అలాగే లోదుస్తులు బాగా బిగుతుగా ఉండేవి వేసుకోకూడదని, వదులుగా ఉండే వాటినే ధరించాలని చెబుతున్నారు.

వ్యంధ‌త్వంతో బాధ‌ప‌డుతున్న 60 మందికి లైకోపీన్ సప్లిమెంట్ల‌ను ఇచ్చి అధ్య‌య‌నం నిర్వ‌హించారు. 12 వారాల పాటు వారిపై ట్ర‌య‌ల్స్ జ‌రిగాయి. ఆ త‌ర్వాత వారి వీర్యాన్ని ప‌రీక్షిచంగా, చిక్క‌ద‌నంతో క‌నిపించింది.

అంటే లైకోపీన్ తీసుకోవ‌డం వ‌ల్ల వీర్య‌క‌ణాలు ఆరోగ్యంగా ఎద‌గ‌డ‌మే కాకుండా, వాటి సంఖ్య కూడా పెరిగిన‌ట్లు ప‌రిశోధ‌న‌లో తేలింది. కాబట్టి పిల్లల కోసం ప్రయత్నిస్తున్న దంపతులు రోజూ రెండు స్పూన్ల టమోటో జ్యూస్‌ను తాగితే ఎంతో మంచిది.

Latest News