Banana | ఇది ప్ర‌పంచంలోనే అతి పెద్ద అర‌టి చెట్టు.. ఒక్కో పండు బ‌రువు 3 కేజీల పైనే..!

Banana | అర‌టి చెట్ల‌ను మీరు ఎప్పుడైనా చూశారా..? దాదాపు 10 అడుగుల ఎత్తు వ‌ర‌కు పెరుగుతాయి. ఒక్కో అర‌టి పండు( Banana Fruit ) బరువు కూడా గ్రాముల్లో ఉంటుంది. కానీ ప్ర‌పంచంలోనే అతి పెద్ద అర‌టి చెట్టు ఎక్క‌డుందో తెలుసా..? మ‌రి ఆ చెట్టుకు కాసే అర‌టి పండు గ్రాముల్లో కాదు.. కిలోల బ‌రువు ఉంది. ఆ చెట్టు వివ‌రాలు, పండ్ల బ‌రువు తెలుసుకోవాలంటే ఇండోనేషియాకు వెళ్ల‌క త‌ప్ప‌దు. ఇండోనేషియా( Indonesia )కు స‌మీపంలోని […]

  • Publish Date - March 31, 2023 / 06:20 PM IST

Banana | అర‌టి చెట్ల‌ను మీరు ఎప్పుడైనా చూశారా..? దాదాపు 10 అడుగుల ఎత్తు వ‌ర‌కు పెరుగుతాయి. ఒక్కో అర‌టి పండు( Banana Fruit ) బరువు కూడా గ్రాముల్లో ఉంటుంది. కానీ ప్ర‌పంచంలోనే అతి పెద్ద అర‌టి చెట్టు ఎక్క‌డుందో తెలుసా..? మ‌రి ఆ చెట్టుకు కాసే అర‌టి పండు గ్రాముల్లో కాదు.. కిలోల బ‌రువు ఉంది. ఆ చెట్టు వివ‌రాలు, పండ్ల బ‌రువు తెలుసుకోవాలంటే ఇండోనేషియాకు వెళ్ల‌క త‌ప్ప‌దు.

ఇండోనేషియా( Indonesia )కు స‌మీపంలోని పాపువా న్యూగినియా( Papua New Guinea ) దీవుల్లో అతి పెద్ద అరటి చెట్టు( Banana Tree ) పెరుగుతుంది. ఈ చెట్లు కొబ్బ‌రి చెట్టు( Coconut Tree ) ఎత్తులో పెరుగుతున్నాయి. మ‌రి ఈ చెట్టు పండ్లు కూడా కిలోల బ‌రువు ఉన్నాయి.

ఒక్కో అర‌టి పండు బ‌రువు 3 కిలోల పైనే ఉంది. అంటే ఒక్కో అర‌టి పండు బ‌రువు న‌వ‌జాత శిశువు బ‌రువుకు స‌మానం. అయితే పండు ప‌క్వానికి రావాలంటే దాదాపు ఐదేండ్ల స‌మ‌యం ప‌డుతుంది. ప్ర‌స్తుతం ఈ అర‌టి చెట్టు, పండ్లకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

అర‌టి పండు అంద‌రికీ అందుబాటులో ఉండే ఫ్రూట్.. ఆహారం అందుబాటులో లేనప్పుడు అర‌టి పండ్లు తిని క‌డుపు నింపుకుంటాం. ఈ అర‌టి పండ్ల‌లో పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. పొటాషియం కూడా పుష్క‌లంగా ఉంటుంది. జీర్ణ‌క్రియ‌కు తోడ్పాటును అందిస్తుంది.

దీంతో ఈ పండును ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఆహారంలో భాగం చేసుకుంటారు. అర‌టి పండును కేక్‌లు, ఐస్‌క్రీమ్స్, ఇత‌ర ఆహార ప‌దార్థాల త‌యారీలో కూడా వినియోగిస్తారు.

Latest News