హ‌నుమంతుడికి అర‌టి పండ్లు ఎందుకు స‌మ‌ర్పించాలి..? ఆ ర‌హ‌స్యం ఏంటో తెలుసా..?

హ‌నుమంతుడికి ప్ర‌ధానంగా సింధూరం, త‌మ‌ల‌పాకుల‌తో పూజించి, త‌మ కోరిక‌లు నెర‌వేర్చాల‌ని మొక్కుతారు. దీంతో పాటు అర‌టి పండ్లు కూడా స‌మ‌ర్పిస్తే మ‌న కోరిక‌ల‌న్నీ త‌ప్ప‌కుండా నెర‌వేరుతాయ‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. అస‌లు ఆంజ‌నేయుడికి అర‌టి పండ్లు ఎందుకు స‌మ‌ర్పిస్తారు..? దాని వెనుకాల ర‌హ‌స్యం ఏంటో తెలుసుకుందాం..

  • Publish Date - April 2, 2024 / 06:47 AM IST

హ‌నుమంతుడికి ప్ర‌ధానంగా సింధూరం, త‌మ‌ల‌పాకుల‌తో పూజించి, త‌మ కోరిక‌లు నెర‌వేర్చాల‌ని మొక్కుతారు. దీంతో పాటు అర‌టి పండ్లు కూడా స‌మ‌ర్పిస్తే మ‌న కోరిక‌ల‌న్నీ త‌ప్ప‌కుండా నెర‌వేరుతాయ‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. అస‌లు ఆంజ‌నేయుడికి అర‌టి పండ్లు ఎందుకు స‌మ‌ర్పిస్తారు..? దాని వెనుకాల ర‌హ‌స్యం ఏంటో తెలుసుకుందాం..

ప్ర‌తి మంగ‌ళ‌వారం హ‌నుమాన్ భ‌క్తులు ఆంజ‌నేయ స్వామి ఆల‌యాల్లో వాలిపోతుంటారు. ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, త‌మ మొక్కులు చెల్లించుకుంటారు. హ‌నుమంతుడికి ప్ర‌ధానంగా సింధూరం, త‌మ‌ల‌పాకుల‌తో పూజించి, త‌మ కోరిక‌లు నెర‌వేర్చాల‌ని మొక్కుతారు. దీంతో పాటు అర‌టి పండ్లు కూడా స‌మ‌ర్పిస్తే మ‌న కోరిక‌ల‌న్నీ త‌ప్ప‌కుండా నెర‌వేరుతాయ‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. అస‌లు ఆంజ‌నేయుడికి అర‌టి పండ్లు ఎందుకు స‌మ‌ర్పిస్తారు..? దాని వెనుకాల ర‌హ‌స్యం ఏంటో తెలుసుకుందాం..

అరటిపండ్లు ఎందుకు సమర్పించాలి?

శ్రీరాముని అవతార పరిసమాప్తి సమయంలో గంధమాదన పర్వతంలోని అరటి తోటల్లో తపస్సు చేసుకుంటున్న హనుమంతుని వద్దకు శ్రీరాముడు వెళ్లి ఇలా అన్నాడంట! నీకు ఎంతో ఇష్టమైన అరటి తోటలో ఉండి ఒక్క అరటి పండును కూడా తినకుండా నిగ్రహంతో తపస్సు చేస్తున్నావు. అందుకే ఎవరైతే నీకు అరటి పండ్లను సమర్పిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా పరిపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుందని వరం ఇచ్చాడంట. అందుకే ఆంజనేయునికి అరటిపండ్లు సమర్పిస్తే హనుమంతుడితో పాటు ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహం కూడా పరిపూర్ణంగా పొందవచ్చు.

వడ మాల ఎందుకు సమర్పిస్తారు..?

మంగ‌ళ‌వారం రోజు ఆంజ‌నేయ ఆల‌యానికి వెళ్తే హ‌నుమంతుడికి వ‌డ‌మాల స‌మ‌ర్పించే భ‌క్తులు అధికంగా ఉంటారు. స్వామి వారికి పూజ అనంత‌రం ఆ వ‌డ‌మాల పూజారి భ‌క్తుల‌కు అందిస్తారు. ఆ త‌ర్వాత భ‌క్తుడు వ‌డ‌ల‌ను ఇత‌ర భ‌క్తుల‌కు అందిస్తాడు. అయితే వ‌డ‌మాల వెనుకాల ఉన్న ర‌హ‌స్యం ఏంటంటే.. హనుమంతుడు ఒకసారి రావణుడి నుంచి శని దేవుడిని రక్షించాడు. అందుకుగాను శని దేవుడు హనుమంతుడిని ఆశీర్వదించి, హనుమను కొలిచిన వారికి శని బాధలు ఉండవని ఒక వరం ఇస్తాడు. కావున శనిదేవునికి ప్రీతిపాత్రమైన మినుములతో తయారు చేసిన వడలను మాలగా చేసి హనుమకు సమర్పించినట్లైతే శని భగవానుని అనుగ్రహం పొంది మనలను పీడించే శని బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. దీంతో భ‌క్తులు హ‌నుమంతుడికి వ‌డ‌మాల స‌మ‌ర్పించి శ‌ని బాధ‌ల నుంచి విముక్తి పొందుతార‌ని న‌మ్మ‌కం.

Latest News