Banana | ఆకాశాన్నంటిన అర‌టి పండ్ల ధ‌ర‌లు.. ఆందోళ‌న‌లో కొనుగోలుదారులు

Banana | మొన్న‌టి వ‌ర‌కు ట‌మాటా ధ‌ర‌లు ఆకాశాన్నంటిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కిలో ట‌మాటా రూ. 50ల‌కు విక్ర‌యిస్తున్నారు. మార్కెట్ల‌లోకి ట‌మాటా స‌ర‌ఫ‌రా పెర‌గ‌డంతో.. వాటి ధ‌ర‌లు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. అయితే తాజాగా అర‌టి పండ్ల ధ‌ర‌లు ఆకాశాన్నంటాయి. బెంగ‌ళూరులో కేజీ అర‌టి పండ్ల ధ‌ర రూ. 100కు చేరింది. అర‌టి పండ్ల ధ‌ర‌లు పెర‌గ‌డంతో.. కొనుగోలుదారులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. రైతుల నుంచి అర‌టి పండ్ల స‌ర‌ఫ‌రా త‌గినంత‌గా లేక‌పోవ‌డంతో.. ఆ పండ్ల‌కు డిమాండ్ […]

  • Publish Date - August 16, 2023 / 04:09 PM IST

Banana | మొన్న‌టి వ‌ర‌కు ట‌మాటా ధ‌ర‌లు ఆకాశాన్నంటిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కిలో ట‌మాటా రూ. 50ల‌కు విక్ర‌యిస్తున్నారు. మార్కెట్ల‌లోకి ట‌మాటా స‌ర‌ఫ‌రా పెర‌గ‌డంతో.. వాటి ధ‌ర‌లు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. అయితే తాజాగా అర‌టి పండ్ల ధ‌ర‌లు ఆకాశాన్నంటాయి.

బెంగ‌ళూరులో కేజీ అర‌టి పండ్ల ధ‌ర రూ. 100కు చేరింది. అర‌టి పండ్ల ధ‌ర‌లు పెర‌గ‌డంతో.. కొనుగోలుదారులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. రైతుల నుంచి అర‌టి పండ్ల స‌ర‌ఫ‌రా త‌గినంత‌గా లేక‌పోవ‌డంతో.. ఆ పండ్ల‌కు డిమాండ్ పెరిగింద‌ని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు.

బెంగ‌ళూరులో విక్ర‌యించే అర‌టి పండ్ల‌లో మెజారిటీ వాటా త‌మిళ‌నాడు రాష్ట్రం నుంచే వ‌స్తాయి. ఎల‌క్కిబ‌లే, ప‌చ్‌బ‌లే ర‌కాల‌ను బెంగ‌ళూరు వాసులు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డి కొంటారు. త‌మిళ‌నాడు నుంచి ఈ ర‌కం పండ్ల స‌ర‌ఫ‌రా త‌గ్గిపోయింది.

నెల రోజుల క్రితం బిన్నీపేట్ మార్కెట్‌కు 1500 క్వింటాళ్ల ఎల‌క్కిబ‌లే స‌ర‌కు వ‌స్తే.. ప్ర‌స్తుతం అది వెయ్యి క్వింటాళ్ల‌కు ప‌డిపోయిన‌ట్లు అధికారులు తెలిపారు. మ‌రికొన్ని రోజుల్లో ఓనం, వినాయ‌క చ‌వితి, విజ‌య ద‌శ‌మి పండుగలు రానున్న నేప‌థ్యంలో ధ‌ర‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని ఓ మండి వ్యాపారి అభిప్రాయ‌ప‌డ్డారు.

Latest News