Site icon vidhaatha

Woman Head Bath | గురువారం ఆ ప‌ని చేస్తే.. సంతానం క‌ల‌గ‌క‌పోవ‌చ్చు..! ఇంకెన్ని స‌మ‌స్య‌లో తెలుసా..?

Woman Head Bath | ప్ర‌తి ఒక్క‌రూ జీవితంలో ఉన్న‌తంగా బ‌తికేందుకు ఆరాట‌ప‌డుతుంటారు. అందుకోసం అనేక ర‌కాల మార్గాల‌ను అన్వేషిస్తుంటారు. కొంద‌రు భ‌క్తి మార్గంలో వెళ్తుంటారు. మ‌రికొంద‌రు వాస్తు శాస్త్రాన్ని న‌మ్ముంటారు. అయితే భ‌క్తి మార్గంలో వెళ్లే వారు ప్ర‌తిరోజు త‌ల‌స్నానం చేయ‌డం, ఇంటిని నీటితో శుభ్రంగా క‌డ‌గ‌డం వంటి ప‌నులు చేస్తుంటారు. కానీ జ్యోతిష్య శాస్త్ర ప్ర‌కారం గురువారం త‌ల‌స్నానం చేయ‌డం మంచిది కాద‌ని పండితులు చెబుతున్నారు. మ‌రి ముఖ్యంగా మ‌హిళ‌లు గురువారం కొన్ని నియ‌మాలు పాటించాల‌ని లేక‌పోతే అది సంసార జీవితంపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని పేర్కొంటున్నారు. మ‌రి గురువారం చేయ‌కూడ‌ని ప‌నులు ఏంటో తెలుసుకుందాం..

గురువారం అస‌లు చేయ‌కూడ‌ని ప‌నులు ఇవే..

-జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం మ‌హిళ‌లు గురువారం త‌ల‌స్నానం చేయ‌కూడ‌దు. ఇలా చేయడం వల్ల జాతకంలో గురు స్థానం బలహీనపడుతుంది. దీనితో పాటు, వైవాహిక జీవితంపైనా చెడు ప్రభావం ప‌డుతుంది. ఆ దంప‌తుల‌కు సంతానం క‌ల‌గ‌క‌పోవ‌చ్చు.

-గురువారం నాడు చేతులు, కాళ్ల‌ గోర్లు కత్తిరించకూడదు. ఇలా చేయడం వల్ల వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది, జాత‌కంలో గురు గ్రహం స్థానం బలహీనంగా మారుతుంది.

-గురువారం నాడు దక్షిణం, తూర్పు, నైరుతి దిశ‌ల్లో పూజ చేయడం మంచిది కాదు. ముఖ్యంగా ఈ రోజు దక్షిణం వైపు తిరిగి అస్స‌లు పూజ చేయ‌కూడ‌దు.

-గురువారం రోజు అరటిపండ్లు తిన‌కూడ‌ద‌ని… బదులుగా, ఈ రోజు అరటి మొక్కను భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజించాలనే నియ‌మం ఉంది.

-గురువారం రోజు బట్టలు ఉతకడం, ఇల్లు క‌డ‌గ‌డం స‌రికాద‌ని చెబుతారు. ఎందుకంటే ఇది జాతకంలో గురు స్థానంపై చెడు ప్రభావం చూపుతుంది. ల‌క్ష్మీదేవి ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌వుతుంది.

-ఈ రోజు నీలం, నలుపు దుస్తులు ధరించడం మంచిది కాద‌ని పురాణాల్లో పేర్కొన్నారు.

-గురువారం నాడు క్షుర‌క‌ర్మ‌ చేయకూడదు. ఇలా చేయడం వల్ల సంతానం విషయంలో అనేక రకాల సమస్యలు త‌లెత్తుతాయి.

Exit mobile version