Bandi Sanjay : గోపీనాథ్ ఆస్తుల కోసమే కేటీఆర్, రేవంత్ మధ్య గొడవలు

గోపీనాథ్ ఆస్తుల కోసమే కేటీఆర్‌, రేవంత్ రెడ్డి మధ్య గొడవలు రేగాయని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. విచారణ చేయాలంటూ డిమాండ్.

Bandi Sanjay

విధాత, హైదరాబాద్ : మాగంటి గోపినాథ్ ఆస్తుల కోసమే సీఎఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ల మధ్య గొడవలు రేగాయని స్టార్ట్ అయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. గోపీనాథ్ చనిపోయాక ఆయన ఆస్తులను వాళ్లద్దరూ పంచుకున్నారని, గోపీనాథ్ మరణంపై స్వయానా తల్లి కేటీఆర్ పై ఆరోపణలు చేసినా..ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ నేతలెవరూ స్పందించకపోవడానికి కారణం కూడా అదేనని చెప్పారు. గోపీనాథ్ ఆస్తులెన్ని? అవన్నీ ఎటుపోయాయో? ..గోపీనాథ్ మరణం, ఆస్తుల వ్యవహారంపై విచారణ జరిపించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. గోపినాథ్ ఆస్తులతో రేవంత్ రెడ్డికి సంబంధం లేకుంటే గోపీనాథ్ మరణంతో పాటు ఆస్తిపాస్తులపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.

గోపినాథ్ మరణం అందరిలోనూ అనుమానాలు

గోపీనాథ్ మరణంపై కుటుంబ సభ్యులు, ఆసుపత్రి యాజమాన్యం స్టేట్ మెంట్లను రికార్డు చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. తన తండ్రిని చూడటానికి రావొద్దంటూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి పువ్వాడ అజయ్ బెదిరించినట్లు గోపీనాథ్ కొడుకే ఆరోపించారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి గుండె మాత్రం కరగడం లేదు… స్పందించడం లేదు. ఎందుకంటే గోపీనాథ్ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి ట్విట్టర్ టిల్లు మధ్య పంపకాల యవ్వారం ఉందన్నారు. అసలు గోపినాథ్ ఎప్పుడు చనిపోయారన్నది కూడా మిస్టరీగా ఉందని..స్వయానా ఆయన తల్లి కూడా ఇదే విషయం ఆరోపించిందన్నారు. గోపీనాథ్ మరణంపై ఆయన అనుచరులకు, బీఆర్ఎస్ క్యాడర్ కు కూడా అనేక అనుమానాలున్నాయని. జూబ్లిహిల్స్ ఎన్నికల్లో గోపీనాథ్ అనుచరులెవరూ ప్రచారం కూడా చేయడం లేదు. ప్రజలకు వాస్తవాలు అర్ధమయ్యాయన్నారు.

దొంగ సర్వేల పేరుతో కుట్ర

జూబ్లీహిల్స్ లో బీజేపీ గెలవకూడదనే కుట్రతోనే మా సభలకు అనుమతి ఇవ్వడం లేదు అని..దొంగ సర్వేల పేరుతో బీజేపీ పోటీలో లేదంటూ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఏపీకి చెందిన ఓ సర్వే సంస్థను తమకు అనుకూలంగా ఫలితాలు ఇవ్వాలని బీఆర్ఎస్ రూ.2కోట్లు ఇచ్చింది. కాంగ్రెస్ కూడా కొన్ని సర్వే సంస్థలతో అనుకూల ఫలితాలను ఇప్పించుకుంది. ఎన్ని సర్వేలు వచ్చినా..జూబ్లీహిల్స్ లో బీజేపీ గెలవడం ఖాయం అని బండి సంజయ్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ ఐఎంసీ(ఇండియన్ ముస్లిం కాంగ్రెస్) మధ్యే పోటీ. కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓట్లు కోసం మాత్రమే యత్నిస్తోంది. కాంగ్రెస్ అంటేనే ముస్లింలు అని రేవంత్ రెడ్డి చెబుతున్నారని..దేశ జవాన్లను అవమానించేలా, హేళన చేసేలా మాట్లాడారు అన్నారు. హిందువులంతా తమ సత్తా ఏమిటో కాంగ్రెస్ కు రుచి చెప్పాలని కోరుతున్నానన్నారు బీఆర్ఎస్ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని.. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ముందే చేతులెత్తేసింది అని విమర్శించారు.